తనతొలకరింపు గర్భకుహరమున
తొల్లిటి దశ నుండీ
తను కంటిపాప లాలిపాట
తలుచుకు మురిసేను తల్లి
తనువెల్ల బరువే తను
తినితినకత నెత్తురుపంచు
జేజలకు మ్రొక్కు,జవములు
జన్మమెత్తెడు తనకు ధారవోయు
రాజీవరామ, కావుమ'నును
తను మంద గమనయౌను
నొచ్చునేమో చిన్ని మొగ్గయని.,
కలల తేలుచు కన్నుల తడిచేకొనుచు లాలించు,
కలయని తెలిసి మురిసి మురిసి నగును!
తిన'నేరకయు తినకున్న,
తనయ'కాకలగునని తినును!
ఎన్నిరోజులన్నీయు కలవలె కరగిపోవగ
యెడద యదర భీతిల్లు!
మరల కూడగట్టు!
తన వశమున తనువుంచును
నెలలునిండ లే భ్రాయపుకొమ్మ
మందశ్మిత యగుచు
అమ్మ 'నేనోపలేనమ్మ'యని,గునుచును !
చనివచ్చు మగని చేయినలుపును.
నాయన కావు మనును. నిండి
నవమాసముల
కనును పండంటి పాపరేని!
నిలువెల్ల కనులు జేసుకు
పసికూనకు చన్ను కుడుపు!
అమ్మ యన్న ' కమ్మని కల'
గద మరువకమ్మ మరి,
నీనడకన అమ్మనీడ దాటిననూ!!
All reactions:
1Mar Vense
No comments:
Post a Comment