ఒంటివాడి నైతిని తుంటరి మనమున
ఒంటివాడినైతిని తుంటరి మనమున
మనమే వనమూ వశమే హరిణము
తనూవే వనమున విరీసిన తరువూ
కోరికలందున కలదిరిగెడు పులుగులు
రామ వంటివాడినైతి వెంటరాగదె రామ
వంటివాడినైతి వేగమె రాగదే
ఇంటిని విడిచి మింటికేగు తరుణమున
వంటిన నిలచి కంటిన పొడమెడు కోర్కెలు
కోటి జన్మలకు తీరవు అరయగ నిజమును
చేటు ఖర్మము చేసితి యెరుగక యేమారి
వంటివాడినైతిని ఒంటిమిట్టను వెలసినరామ
కంటిని కలయందున నీవెదిక్కని వింటిని
వింటినిపొడుగంటి చేతుల విరిచి కలకంఠి
అమ్మ ధరణిజను పరిణయమిడిన రామ
ఒంటరి నైతిని తుంటరిమనమున అంటిన
కల్మష రక్కసమూకల దునుమ
జంటగ రావే రామా మాఇంటికిరావేరామా
No comments:
Post a Comment