అమ్మ పెట్టిన వెన్న వద్దువద్దని
వూరిలోన గోపెమ్మ ఇంటినవుట్టిని
కొట్టి వెన్నలారగించేటి కన్నయ్య
వూయలూపి లాలిపాడు మాచిట్టితల్లికి
ఒజ్జగా నిలాబడి నల్లపామూ చిలుమడచి
చల్లనీ యమునమ్మ కడుపు కాచిన నల్లనయ్య
వూయలూపి లాలిపాడు మాచిట్టితల్లికి
ముగ్గువేయుచు వుగ్గుతాపుచు మొగని
ఒల్లుతోముచు శ్వాసనందు సైతము
హరిధ్యాసనెంచినగోప కాంతలను
లజ్జవిడచి మొక్కరే మోక్షమిత్తునన్న హరి
ఊయలలూపి నిదుర బుచ్చు మాచిట్టితల్లిని
చెక్కిలిపైన పైన చక్కగా మురళినొత్తి
ముజ్జగమూలూ మైమరచిపోవంగ
ఆలమందలూమోరలెత్తి చేపుకు చేర
గాలిపాట పాడి నిదురబుచ్చు మాచిట్టితల్లిని
No comments:
Post a Comment