Sunday, May 11, 2025

 జోలాలీ జోలాలీ

జోలాలీ జోలాలీ
జాబిల్లీ వచ్చేను వెన్నెల్లూ తెచ్చేను
జోలాలీ జోలాలీ
రామయ్య వచ్చేను బాణాముతెచ్చేను
జోలాలీజోలాలి
కన్నయ్య వచ్చేను కస్తూరి తెచ్చేను
జోలాలి జోలాలీ
అచ్చర్లు వచ్చేరు పేరంటమాడేరు
జోలాలీ జోలాలీ
అక్కల్లువచ్చేరు వెన్నెల్లొ పాడేరు
జోలాలీ జోలాలి
చిలకమ్మ వచ్చింది చిగురాకు తెచ్చింది
జోలాలీజోలాలీ
అమ్మమ్మ వచ్చిందీ అప్పచ్చి తెచ్చింది
జోలాలీజోలాలీ
నానమ్మ వచ్చిందీ నగలెన్నొ తెచ్చింది
జోలాలీజోలాలీ
జోలాలీజోలాలీ మాకంటి పాపా జోలాలీ
మామంచి పాపాజోలాలీ జోలాలీ
శ్రీరంగ మంగళదీపాజోజో లాలి
జోలాలీజోలాలి జోలాలీజోలాలి
All reactions:
Maddali Manjula Vijayasri, Ananth Samudrala and 2 others
6
Share

No comments:

Post a Comment