Thursday, June 5, 2025

 జంతుల పగిది తంతువులు చీల

గొంతులెత్తి గీ పెట్టెడు
వంతులకుపోయి
పీన్గుల పీకెడు
నైచ్యము లాయె
పైచ్య రాజకీయ
హేయ విన్యాసములు!
అయ్యో బురదన
మొలచిన నీరదము
నలుపాయె,కమ్మ
చివురనెగిరెడుతెలు
గమ్మ చెరగు చిరిగె!
మాన వంతులార, స
మ్మాన సమయమె, తా
మెరుగరె రూకలబొక్కెడు,
ములుమ్రుచ్చులె వీరలు, కో
కలె వేరు కోర్కె లొకటె!!
మును మొసలి యొక్కడు
చెలిమిన కోతినొకనిని
నిగిడి నడుమున నిడుకొని
నడి సంద్రమున గుండెకోరె
టక్కరి కోతి తెగ రోజుచు
తెలిపె, తనదు గుండె
తరుశాఖన భధ్రమయ్యెనని
ఆహా, కోతి పాటి తెలివి
మొసలి పాటి స్నేహము
కరువె, మన పాలికల
కొలత తక్కుడు నీతి
నెల తక్కుడు జాతి!!
All reactions:
Srinivas Maringanti, Venkata Rama Krishnayya Tippabhotla and 6 others
4 comments
1 share
Share

No comments:

Post a Comment