Wednesday, May 7, 2025

 ఫుడమి వడిన విడిదైన అడవీ

నీదు గుండెల చడిచప్పుడా
నాటిపడిగ గొడుగు అలరేడు
అవనిజకైవడి తరుల ఎడద
బిగియార సుడిజుట్టి
అడుగడుగున హా సీత హా సీత
యని కన్నులరమూసిగీలించుచు
నడచిన వడి వడి అడుగుల చప్పుడు గాదె.
ఎంతటి భాగ్యశాలివమ్మ అడవి తల్లి!
సూర్య చంద్రులు కనరాని నీదు చిక్కని...
తనను కనిపెంచిన తనువును
తన చేతన తనువైన తనకును
తానైన తన్వికి నెలవైన
తన్మయమతి ధరిత్రీ వందనము.
All reactions:
1
3 shares
Share

No comments:

Post a Comment