Thursday, June 19, 2025

 నివురూదిన నిప్పులె నిజనైజమునెరిగిన

ఒరులేయినియనిన విని యాత్మనరయనెంచిన

పర వివరములెంచక ఇంచుక గారవించిన

ఘనమె వారి మనము ప్రసూన పరిమళమె

జనని లేదు అవనిజ అసురసమాహిత, తా తపసి కాదు

తనదు తమ్ము జవతప్పె తనువు శ్రమంబయ్యె 

నగద బంధితమేను ధరయాధరమయ్యె

నరవివరమున నారాయణుడు శేషశయనుడయ్యె

సకల కళాపారీణ హనుమసైతము విభ్రమమతియయ్యె

సర్వ కపిజాతులు నాగపాశబద్దులయ్యె

ఆకసము కాలసర్పప్రహేళికాలాపమయ్యె

మేఘనాధ జోధాధిపత్య ఘట్టముననంత

అవతారమని ఎంచడె తారెక్కలల్లార్చుచు

అవధరింపుము స్వామి నామేనినిచాలదనుకయ్యె

తమమున నిలచి యనుచు రెక్కలూచె గరుడపతి

విస్మృతావతారసృంగారరామము విపాశమయ్యె

వీవనాదిశేవలేల తండ్రీ 

ఎవ్వరివాడవీవు వినయమతీ

రామ మహాభాగ, నేదాసుడ నీ

పాదప రేణువను నిక్కముతండ్రీ

ఏమిటికి తండ్రి విలంబనము

ప్రాణికోటికప్రియములజేసెడు

దశదిశాధినేత దశకంఠుదునుమ

దాశరధి ధనుర్భాణముల్జేకొనవె

యని వినతాసుతు మననాధుకు

నయ వినయముగ విన్నవించె

నంతకుశలమతి జడలు ముడివైచి 

ధనువుగొని నారిసంధింపగ

వంటినంటిన ధూళి విదళితమై

నేలకూలినవానరభల్లూకసంతులెల్ల

పెనుప్రళయమున వ్రాలినయరటితోట

నిలువారినటుల సకలపాటవోద్దీపితులైరి


No comments:

Post a Comment