Thursday, June 19, 2025

 ధర్మము జనజీవన హితమె హితైషిత్వమె

అది జగదైకము ప్రాకృతికము యది ప్రాచీనము
నైచ్యత హీన్యతాన్యూనతాది వికృతములంటనీయనిది
పెన్నిధి తరతరముల తపహ్ఫలమది సామాజికస్పృహయది
ఆత్మైక సోధనమది బ్రహ్మజ్ఞానార్జనకు మొదటిమెట్టు

కర్మలు జన్మలనుసరించును
జన్మలు కర్మల తుది మెరుగులు
నలువెట్టిన ఒడలు వెలుగొందినట్లు
విలువల కర్మలు జన్మను తీరుపు చేయును
కోటి జన్మల వివరమరయ మనిషికి
ఇంగితమను వెలుగు మనమున కలదు
తనకు జీవనపర్యంతము తానెయైన
మరణకాల క్షణమున మనమున నిలచిన
తృణ భావన పునర్జన్మకు ఖర్మధారియగు
కన్నులొజిహ్వయో పాయువో యొకానొక
చిధ్రము తనదారిని తనకు విడిచిను
అంగలార్చేడి మనము ఆత్మగతి మార్చును
శరీరి ప్రాణము,ఘనరూప గృహ పాలన దానిది
ద్వారములు తొమ్మిది మనసుమూయలేదు
జనఘోన పెనుప్రయాణ సమయమున
సిగ్గిలిన మనము వేదనన పంచేంద్రియాస్రితమగు
 అట్టి తరి ప్రాణము తను చేతనయై
 మలిన మనము నుండి విడివడి
పుణ్యముగొన్న కపాల స్ఫోటనచేసియొ,
కన్నుల కమనీయభావన చేసి పుణ్యముగొన్న
తెరచి రెప్పల చాటునుండి యో,
తిన్న త్రావిన తినక త్రావక జీవి ఆకలి గొన్న
గహ్వర ద్వార నిర్గమనమొ నిర్ణయించును
నీచ నికృష్టభావనలాది నుండి తుదికిసాగిన
ఆత్మ కు క్రిమి కీటక పుటకయె గతి అది
అదో గతమై మనో వీచికలనంట గించుకు
శరీర ఛేదనమొనరించుకు వెలువడి వచ్చు
మనము మన వైదిక శాసనమున మనో
చింతల దీర్పు పదిరోజుల దినము చేసి
మిగిలిన మనః కామనల దీర్చి
దేహము వీడెడి ఆత్మకు పుణ్యపు ఊతమిత్తుము
నవమాస ప్రసవ వేదనచెందెడి శిశువు
గర్భస్థ సౌఖ్యానందములకు నిండు
పన్నెండు నెలలు స్మరింతుము
వాఙ్మనోగోచర మంత్రముల పంచ
భూతముల నర్చింతుము ప్రేతశాంతికి
ఇది హైందవ అంత్య సంస్కారము
షోడశ సంస్కారములు విశేషములె
శేష జీవనమున మిషాది స్పర్ధలు లేక
మన్నన గలిగి ధ్యానాది గుణముల
మానవ జన్మ నవ నవోన్మేషము కావలె
పరమ పద యోగమున నిష్క్రమణ
ఆనందానుభూతిగా విభూతి భాషణ
వినుకున్న అమరులౌదురు నరులు RULES OF DHARMA

No comments:

Post a Comment