Thursday, June 19, 2025

 THE PURPOSE OF DHARMA

ధర్మోద్దేశ్యము ఆత్మైక్యగ్జానమరయుటయనియెగాదు
జీవికయందు అంచితానందము పొందుట
ధుఖ పరీవృతజీవనవలయమున నిర్లిప్తతన జీవించుట
కామనలు శుభస్కరమగుట కీర్తి యశమగుట
అవ్యయ క్షమదమాదులవల్ల ప్రాప్తమగు తృప్తి గొనుట
ధర్మార్ధకామముల మానవత్వమనుభవైక్యమొనరించుట
సమాజమును ఇష్టకామ్యములదీర్పునందు వివేకభరితముగదీర్చుట
ధ్రితి యది కూడి వసించుచు పరమార్ధమునెంచుట
యట్టిది ధర్మము ఆజీవపర్యంత ఆచరిత విధానము   
యట్టిదగుటంజేసి జీవప్రావాహికలగు సమస్తమతములు
తన్మూల సిద్ధాంతములు హైందవధర్మమున చేతక చేతనములు
హైందవధార్మికత సహనశీలియని కొనియాడబడినది. రాముడ ధర్మ
ష్రష్ట్గ సత్యహరిచంద్రుడు నిత్యమగు సత్యసంధతకు తీర్పు
సర్వమత వినయ సంపుటకమె సార్వజనీన ధర్మమని ఎరుగునది
  ధర్మార్థ కామమోక్షోపాయముల వివరము
కడువిమలముగ సమాజమున నివేదితము అదియెట్లన
సహజీవనన్యాయము కష్టనష్టముల కలుపుగోలుతనము
గణ న్యాయము గృహ్య సూత్రములు అన్యోన్యతాస్పూర్థి
వెరసి సామాజిక ధర్మమైనది,స్తితినిలిపెడి భూసాయము
ఫలసాయమిచ్చెడి వ్యవసాయము,కూడుగుడ్డలతోడు
కులవృత్తులు చావుకు పుటకకు ఆపదదీర్చు స్వాంతనగూర్చు
హితులు, కర్మజేసెడు కాపరులు తీరుపుజేసెడు పెద్దలు సంఘమండ్రు
అట్టి సంఘముల చేరికయె బృహత్సమాజము,ఆపదనెంచువాడు
అన్యులగాచువాడు,వేళనక గ్రామ రాజ్య క్షేమము నెంచువాడు రాజు
అతని పరివారము వేయినేత్రములు అవితీర్పెడివి వేల వ్యవహారములు
సమాజపరమేష్టికి నైవేద్యము వారి ధీశక్తి.మరి సహజ కామములు
ఒకరికొకరు తోడనునది ఆశా భావము,రాముని తీరు,పదునారు విధముల

No comments:

Post a Comment