మను వనెను నియమమున సహనము
క్షమయె దయ దమమది నిగ్రహము
అస్తేయమన సత్యప్రమాణము సౌచ
మది శుచిత్వము ఇంద్రియనిగ్రహమన
మనసుపైనదుపు ధీశక్తి యన
తాత్విక పరిశీలన విద్యయది అధ్యనము
సత్యసంధత అక్రోధనమన శాంతచిత్తము
ఇవి ధార్మికతా లక్షణములు
సత్యహరిశ్చంద్రుడు,శిబి దధీచి
నల రఘు మహారాజాదులు,బలి
మనువను వారలు ధర్మరూపులు
అవతారములు ధర్మ ప్రతిష్టకై
యని రుషిప్రోక్తముగ తెలియును.
మన విశ్వాసములు పౌరాణికములు
చరితాబద్ధములు,శృతి స్మ్రుతి
ప్రవాహములు,జనవాక్యములు
సామాజిక రక్షాబంధనములవి
ధర్మాచరణ వుగ్గుపాలన తల్లి
రక్షా కవచముగ తండ్రి
ఉథానపదమున గురువు
గురుతుగ ప్రసాదించెడివారు
No comments:
Post a Comment