Thursday, June 19, 2025

 చేసెడిచేతలు కర్మమండ్రు

కాని సంకల్పితములె కర్మలు
అసంకల్పిత కార్యములు
కర్మేంద్రియ చోదనములు
కర్మలుకావుమనహ్ ప్రేరణన
కామక్రోధలోభ మోహ మద మాత్సర్య
లస్ఖ్యలక్షణ ప్రేరితములు అయ్యెడివి
కర్మలు, సంపర్కదోషములయ్యు
మరణాంతరమాత్మను విడువవని '
నమ్ముదురు హైందవ ధర్మమున
మనోవికారములు సంస్కారమున
అగ్నికాహుతియగు చెదలని
అట్టి సంస్కారము తలి తండ్రులు లిత్తురు
గురువులిత్తురు. కొండొకచో
తలితండ్రులు సర్వమండ్రు సామాజిక
సంస్కార దీపము వెలిగింపగ
భగవద్కృప యన్నది మొదలు కాదు
కర్మయె మొదలౌ పుణ్యార్జనకు
భక్తి ఔదార్యమును పెంచుటకె కాని
ధర్మమునంతటికి ఆద్యంతముకాదు
నమ్ముదుము మరు జన్మమును
సంచితమగు కర్మలు విలంబితములు
మదిని సుడిద్రిప్పి జన్మకారణము
గతినుండి మరుపు తెరుపులందు పడవెయును
కనుక సద్గతికై శ్రేయము నిష్కామము
మాతృయారాధన సమ్మానవత
జీవిక లందురు షిష్యప్రవృత్తిన
ప్రకృతి,ప్రసాదించు మనకు వీనిని
చేసిన కర్మ చేతికి అండయగు
మనసుకు శాంతి యగు,పదుగురిన
నిలవెట్టుటయొ వుపేక్షించుటయొ
తధ్యము బ్రతుకు బాటన చూతుము
కీర్తికి చావులేదని మంచికి మరుగుండదని
ధర్మమే జీవమని సత్యమై జయమని
భరత భారత ధర్మ ప్రవచనము
మన తరతరముల భావన అదియె
సత్యమేవ జయతే యని శాసనమై నిలిచె
----------------------------------------------

No comments:

Post a Comment