Thursday, June 19, 2025

 తెలుగున వెలుగైన దాశరధి

కలనేత కన్నడ తమిళ వారధి
అరయగ నారవ నూరునకోరిన
రూపందిన కోదండపాణి రాముడు
ఏకశిలన చేతనమందిన రాముడు
తెలుగు వెలుగుకు మున్ను రాఘవుడు
ఆంధ్రమన్నది గీర్వాణము కాకమున్నె
నోరుతిరిగి కోడండరాముడాయె నోటిన!
తేట తెలుగు మాట ఆర్యులకు మున్నటిదె!
ఆట వెలది కోదండ పాణి కోటన ఆటాడుట,
తేటగీతి పూదండ మణిమేఖలమగుట,
కందముఅందచందముల సిగ నగ యగుట,
జానపదుల జానుతెనుగు చోద్యమే నగుమరి!!
యాస ప్రాసల మాటపాటల వూపిరి రాముడు,
విజయాదిత్యుని కోటన వులిరాపాడించిన
ఉప్పర జక్కన తాతో ముత్తాతో.,తెలుగే
రాయనేర్వని రామ రూపు దిద్దిన మయుడే!
కందుము ఒంటిమిట్టన,రామ తీర్ధమున
అంతర్వేదిన తొల్లిటి తెనుగు రాముని
All reactions:
Seshu Maringanti and Sreedevi Aravalli
2 shares
Share

No comments:

Post a Comment