Thursday, June 19, 2025

 

  1. అన్ని ప్రశ్నలకీ సమాధానాలక్కర్లేదు,
    అసలెన్నో ప్రశ్నలకే అక్కరన్నది లేనే లేదు ,
    బండ గుర్తులు పెడితే చాలు .
    కంట బడ్డ ప్రతిదాన్నీ తరచి
    సాధించి సూత్రాలలో బిగించాలనిపించటం 
    మహా చెడ్డ వ్యామోహం సుమా, 
    మనది మండనమిశ్రుల కాలమా?
    ఇట్టే వేదాంతమంతా పట్టుబడే
    కాలమొకటి వస్తేవచ్చిందిగాక, 
    తోసుకుపోతే చాలా , మనమంతటి వారమా ?
    కోహం - అన్వేషణ లో
    " సత్యం తెలియాలి - మొదలు
    నాకే ముందు, నాకే బాగా. నడుమ
    నాకు తెలిసిందే సత్యం - చివర." - ఇట్లా ? 
    నిశ్శబ్దం తో ప్రారంభిస్తే 
    మౌనమయినా శేషం మిగులును
  2. - అడుగుట కక్కరేమి చెప్పెడివాడుండగ
  3. - ఒక్కొక్కరిదొక్కక్క అక్కర,అదియె చిక్కు
  4. - కొక్కిరింత గల అహము అడిగిన వినదు
  5. - వినక చప్పుడొ ఎక్కుడు చదువొ కననేరదు
  6. - మండనమిశ్రుడు ధాతువుల నేర్పరి కాని
  7. - వందిత జనని పావని శంకరుని కన్నులగన్నయమ్మ
  8. - వేదముల నగమును వేగముగ నెక్కుట
  9. - విధము చెడి అఘమున తూలుటయె
  10. - సత్యమన అనంతమె అవకాశాతీతమె
  11. - పరిధిన పరుగెడెడి జీవి అంతము చేరును
  12. - వేదార్ధము తెలిసియు తెలవక నిక్కము,
  13. - మరి వేదాంతమన కాలాతీత సత్యమె
  14. - శ్రేయము ధర్మము మౌనము సౌచము
  15. - అంగములైనప్పుడు కర్మ సచిదానందమగు
  16. - కరచరణాదుల రుచిర స్పర్శాదుల
  17. - విరచిత జీవనము శేష విషయమగు
  18. - కరాగ్రమున నద్దమునిడుకొని
  19. - శిరోముఖ వీక్షణముచేయవచ్చు కాని
  20. - పరేంగితమెరుగక ఆత్మానందమరయగలేము
  21. - నిరంతర యాత్మానందమె వేదాంతపరమార్ధము
  22. - వేదములు పరేంగిత కొరకు ప్రకృతి నరయుటకొరకు
  23. - జీవన వన సంచారమునకు బీజములు
  24. - విధులకు విధి మాలిన తరుణములకు ప్రత్యోపయుక్తములు
  25. విరిబోడి సుర లెరగని విరిశిన నవపారిజాతం
    పరమ శివుని జాలువారిన కుంతల కాంతి
    భరతభవ్య సుధాసంచిత కిశోర వీరగాధ

    ధరిత్రిన భారతి త్వష్ట్రయై వెలుగుట కాద్య
Tuesday, 12 February 2013 at 08:57 UTC+05:30

No comments:

Post a Comment