కానీ నిన్నమొన్నటి కలలో అమ్మ నాయనగారిని సంపాదన విషయంలో కించ చేసి మాట్లాడడం నిద్రకాదునిజమని అనుకొని చొక్కతో కళ్ళు తుడుచుకున్నాను. మెలకువ నిద్ర స్పృహ నిస్పృహ అన్నట్లున్నది .
దీప కన్నడి చెల్లి ... అన్న కి వెలుగు వెన్నెల తనువెల్ల వెలుగైన 'తను పున్నేముల ప్రోవు..పాప కలి కల్మషముల బాపు తీవ, జగతి పాపగతిన కృంగిన తరి వెన్నుడవత రించెనట. నరకాసుర, కంస హింసన కారు చీకటుల చీల్చిన తరి గొల్ల పాపలల్లిరట దీప తోరణములు .. అలకలల్లాడగ వేడుకన వెన్నుడు పిల్లన గ్రొవునూదగ పల్లవించెనట పండగై దీపవల్లికలై., పల్లె పల్లెన గిరిరాజతనయ పార్వతి దీవించినట ' పండుగ జేరు గాక నేటి రాతిరి చీకటుల చెదరగ'. .. ఓ తెలుగుల వెలుగులార వేగము వ్రేల్చరె బాణ సంచయముల వేవేల వెలుగులు విర జిమ్మగ క్రాంతిదొలగి శాంతి విలసిల్లంగ ప్రతి వాడల వూరుల పూల పేరుల అమ్మ జగతిని పూజింపరే.. కళ్ళ కాటుకల మాటు వెలుగు జిజ్ఞాసల వెలిగింపరె పిల్లపాపలకు...
ఉయ్యాలంటే అమ్మ చీరతో వంటికి హత్తుకునే వెచ్చనిమడతల పడక.అది ఊగుతుంది. జోలపాట ఉంటే సరి అది నిద్రకి కొసరు. ఎన్నాళ్లు నిద్రపోయానో.తడుపుకున్నప్పుడూ వెచ్చగానెఉండేది.కానీ అమ్మ తుడిచి పక్కమార్చేది. నాకు తెలుస్తూనే ఉండేది. వెలుగు. చీకటి నిద్రా మెలకువ. ఏడ్పు ఆకలి తెలీదు అమ్మకి నా ధ్యాసే గదా. నానడక గుర్తు లేదు.బహుశా రాత్రనుకుంటా, వంటిల్లు తడి చారికలతో మెరుస్తూ ఉండేది. గడపవతల కూచుని తడి గచ్చు మీద దీపపు ప్రతి బింబాన్ని చూడడం గుర్తు. గదిలో మంచం పైన నాయనగారు. పెద్ద అరచేతులతో ఆయన స్పర్శ బహుశా అందరూ పంచుకునే ఉంటారు.పెద్దక్క చాలా పెద్దది. ఇంకో అక్క తెల్లగా ఉండేది. ఆవిడ స్నేహితులూ పెద్దవాళ్లే.నాకు జుట్టు పెద్దది ఉండేది. అక్కడికి అమ్మ జదలేసేది. నాకు తాత గారు వూలో పురికొసో జుట్టుకి ముడిసేవారు.హైమావతి తెలుసు.కొంచం పెద్దవాళ్ళ భాషలో ముద్దు చేసేది. వాళ్ళందరివల్లా పలుకూ ఉలుకూ
నేర్చుకున్నాను
.వినడం చూడడమూ నక్షత్ర దర్శనము నాయనగారి కదా ప్రవచన పుణ్యమే.
అది తాటాకుల పాక ఇల్లు. అప్పుడు నాకు మూడేళ్లుంటాయేమో. సత్యాన్నదగాలి. ఇంటి వెలుపల ఒక నుయ్యి ఉండేది వరల నుయ్యే . చప్టా ఉండేదికాదు. ఇంటి మధ్యలో మట్టిగోడ పార్టిషన్. కుడి ఎడమలుగా తలుపుల్లేని గుమ్మాలు. అవతల వంటిల్లు. ఇవతల పెద్ద గది .గచ్చు కాదు. అయినట్లో ఎక్కువరోజుల్లేమనుంటా. ఎక్కడా ఉయ్యాల వేసినట్టు. చిన్ని గురించేమో. అంత చిన్నప్పుడు చిన్ని ఎలా ఉండేదో తెలీదు.అక్కడ చిమ్నీ దీపాలు రాత్రయితే బెక బెక చప్పుళ్ళు, కీచు రాళ్ళ రొద . నాకు భయమప్పటికే తెలుసు.అయినా అమ్మ దగ్గరే ఉండేవాడిని. అక్క సత్యం అప్పటికే బడికెళ్ళేవారేమో, తెలీదు. కానీ అమ్మ నోటీదగ్గర బట్టలుతికేదప్పుడు, అంట్లు తోమేటప్పుడు అక్కా సత్యాలు దగ్గరున్నగుర్తు లేదు. అంతమందిని నేలమీద ఎలా నిద్రించామో ఏమో!ఆశ్చర్యమే . అమ్మ ఒరిజినల్గా చాలా రెస్సిలెంట్ అనుకుంటా. తరువాత ఒక డాబా లాంటి ఇల్లు. పెద్ద గది అందులో పెద్ద మంచం అటక. దానికెదురుగా వరండా దాటుకు ముందుకెళితే వంటిల్లు. ఇక్కడకొచ్పటికీ నేను పెద్దయ్యను. మంచం ఎక్కడం అటకండుకోవడమూ నేర్చాను. కొంచెం పేచీలు పెట్టేవాడిని. కోపం చూపించడం స్పృహలోకొచింది.ఇక్కడ కొత్తవాళ్ళు తెలిసారు తాతగారి పరిచయం.కుంజమ్మ గారి కొడుకులేనేమో హరి, శంకర్ . వాళ్ళు చెడ్డ అబ్బాయిలు అని కూడా తెలిసింది. ఈ ఇంటి ఎదురుగా ఒక మెడ మెట్లున్నది ఉండేది. ఇంటి ముందు చెప్తా ఉన్న నుయ్యి . అక్కడ అమ్మ గిన్నెలు తోముకునేది. నేను అమ్మకి సాయం చేసే వాడిని. ఎందుకంటే అక్క సత్యం స్కూళ్ళు వెళ్ళి పోయేవారు. అమ్మ అభిమానం సంపాదించుకునే మంచి అవకాశము . ఆవిడ కడగంటి చూపుకి ఆశ పడే వాడిని. అయితే ఇ క్కడ నుండే బయటి ప్రపంచం గ్రాహ్యత మొదలయ్యింది.ఇళ్ల సముదాయం చుట్టూ ప్రహరీ గోడ ఉండేది. గేటవతల రోడ్డు గంటలు వాయించుకుంటూ ఐస్ ప్రూట్ బండి వాడు పోతూ వుండేవాడు. అప్పుడప్పుడు కొనే వారేమో. వాడిని నాన్నగారు టంగ్ టంగ్ అని సంబోధించేవారు. నేనూ వారిని వో టంగ్ టంగ్ ఆన్ పిలిచే వాడిని . వాడిచేవాడు కాదు. ఐస్ప్రూట్ మిస్ అయిపోయే వాడిని. ఈమోసం చాలా పెద్దైంతర్వాత తెలిసింది. అక్క వాళ్ళ ఫ్రెండ్ హైమావతి అంటే నాకు చాలా ఇష్టం. ఒకరోజు మెళ్ళో గొలుసేసుకోచింది. అప్పుడు నేను వాళ్ళే ముచ్చట్లమధ్యన గొలుసేన్ని వూపాయలని అడిగానని నన్ను ఆటపట్టించారు. అక్క చాలా కంట్రోల్ చేసేది. నాకు బయటకు షికా రెళ్ళడము అప్పుడే తెలిసింది. తాతగారి కూడా బడటంతో వీధి వివరాలు తెలిసాయి. తాతగారి వెనకబడి ఒకసారి దారి తప్పిపోయాను. కాసేపటికి ఒక పోలీసు వాడు ఎత్తైన బల్ల మీద కూచోబెట్టి బఠాణీలు పెట్టాడు. తాతగారు ఎవరెవరో వచ్చారు. అమాంతం ఎత్తుకు ఇంటికి తీసుకెళ్లారు. తరువాత నాకు సినిమా బొమ్మలు చాలా కుతూహలం కలిగించేవి. నిజంగా ఆ బొమ్మలు జేజలనుకునే వాడిని. లేడీస్ అయితే దేవతలుఅనే చాలా కాలం, అంటే నూజివీడు వచ్చేదాకా, నమ్మకం. అన్నట్లు ఈ ఇల్లు మాం బళమ మనుకుంటాను.గుర్తు లేదు. నాకు నాన్న గారు క్షవరం చేయించేవారు. ఆడారిలో ఒక కాలవొచ్చేది. వంతెన దాటి కొంచం దూరం తడవాలి. కానీ నేను నానన్నగారి భుజాలమీదుండేవాడీని. అదొక సవారి. అయితే అమ్మ నాన్నగార్లతో అప్పుడప్పుడు బజారెల్లేవాడిని. రిక్షాలో మధ్యన నేను అటూ ఇటూ అమ్మ నాన్న గారు.ఒకసారి పాన్డెబజార్ వెళ్ళాము. అప్పుడు బిల్hani అద్దం కొన్నాము.నాకు అమ్మ ఎర్ర ఊలు తో స్వెట్టర్ అల్లింది పాలకొల్లు లో కూడా దాన్ని తొడుకున్నట్టు గుర్తు.మనింటి వాళ్ళూ వీళ్లూ వస్తువుండేవారు. సత్యాగ్రహి mama ఒకడు. ఆయన ఉద్యోగమేమీ ఉండేదికాదు డిటెక్టివ్ నవలలు రాశాడని అమ్మంటూ ఉండేది.ఒకసారి నాన్నగారు ఊరెళ్ళారు. తరువాత ఆ ఊరికి మేమూ వెళ్ళాము. పాలకొల్లు దగ్గర పూల పల్లిఅప్పుడు వచ్చాడు సత్యాగ్రహి మామ. అమ్మ గొలుసు డబ్బు కోసం కుదువ పెట్టింది. తరువాత అమ్మ మేము పాలకొల్లు వచ్చామనుకుంటా. సత్యం చెప్పాలి ఈ విషయం .
కాగితపు పూలు కలల వెంటరాలు కనులవియే కనుగొనిన వెనువెంటనె కనులరమూతలగునిదురన చెదిరినగురుతులు ముదిమను తెరగప్పు తరతరములు గడిచి సడిలేక బతుకున పంతపు చిదుకుల మంటన చలికాగి చింతన మరి జవచచ్చిన తరి తరువేదని ఎన్చెడి మదీ ఇది తరుణము ఋణ విమోచన జాగరణకు. నిశాదివస పర్యంతము తలి తండ్రుల చింతజేసి కల్పనలేక అశ్రు తర్పణ మొనరించెదగాక...
పాలకొల్లు ప్రయాణము. విజయవాడలో దిగినతరువాత పెద్ద పొట్లంతో అమ్మ మేన బావ ఇడ్లీలు తెచ్చినట్లు గుర్తు. నాన్నగారు ఇంజను దగ్గర వెన్నీళ్లు పట్టి తెచ్చారు. మేము రైలు మారాము. నన్ను పగటి ప్రయాణం. రైలు ఖాళీగానే ఉంది. కాసేపు కిటికీ దగ్గర కూచున్నా. కంట్లో
పాలకొల్లు ప్రయాణము. విజయవాడలో దిగినతరువాత పెద్ద పొట్లంతో అమ్మ మేన బావ ఇడ్లీలు తెచ్చినట్లు గుర్తు. నాన్నగారు ఇంజను దగ్గర వెన్నీళ్లు పట్టి తెచ్చారు. మేము రైలు మారాము. నన్ను పగటి ప్రయాణం. రైలు ఖాళీగానే ఉంది. కాసేపు కిటికీ దగ్గర కూచున్నా. కంట్లో బొగ్గునలక పడింది. అమ్మ కళ్ళు పెద్దవి చేసి కొంచం తనచీరకొంగు కొసతో నలక తీసింది. కొంగు ఉందా చేసి కాపడం పెట్టింది. తర్వాత అమ్మ అక్క ' వీడిని ఓ కంట కనిపెట్టాలని అనుకున్నారు.ఒక పెద్ద రైల్వే స్టేషన్ వచ్చింది. నాన్న గారు మంచి నీళ్లకోసం ప్లాట్ఫారం మీదికి దిగారనుకుంటాను నాకు కూడాబడడము అలవాటు కదా. కానీ పెద్దక్క కనిపెడుతూనే ఉంది. చెయ్యి పట్టుకు ప్లాట్ఫారం మీద బొమ్మల బండీ, బన్నులబండీ జనాలవైపు నా ద్యాస మరల్చింది. నాన్నగారిప్పుడు వచ్చారో ఎంతెచ్చారో గాని పెద్దక్క అమ్మ సత్యాల దృష్టి నామీంచి మళ్ళింది. అమ్మ చిన్ని, శిరీష్ లతో బిజీ అయ్యుంటుంది. వూరిపేరు నాకు తెలీదు కానీ గబుక్కున రైలు దిగేసాను. దిగే వాళ్ల తోబాటు ప్లాట్ఫారము మీదికి దిగజారాను.ముందుకు నాలుగడుగులేసాను. రైలెళ్లి పోతోంది. తరవాత నేను ఎత్తు బల్ల మీద కూచున్నాను. కానీ బఠాణీలు తింటున్నాను.ఈలోపు ఒకాయనొచ్చాడు. ఉంగరాలజుట్టు కళ్ళజోడు నల్లగా ఉన్నారు , ఆయన వెనకాల నాన్నగారు. గుర్రం బండి మీద నేను నాన్నగారు, చిన్నన్న గారు సైకిల్ మీద. (చిన్నన్న గారిది ర్యాలీ సైకిలు. దీని గురించి మళ్లీ చెబుతాను. ) పాలకొల్లు చేరాను. నా మొదటి వంటరి రైలు ప్రయాణం ఆరేళ్లప్పుడు మొదలయ్యింది.ఎంత గమ్మత్తు, వెనకాల చిన్ని శిరీషు లు చిన్నవాళ్ళు.పెద్దక్క సత్యము పెద్ద వాళ్ళు. అమ్మ నాన్న జేజలు . ఇంతమందిని వదిలి వంటరి ప్రయాణము అప్పుడే మొదలయ్యింది. ( ఇప్పుడెంత విచారించేమి లాభం, అమ్మ లేదు, నాయనగారు లేరు, పెద్దక్క లేదు. సత్యమున్నా మల్లెతీవ లల్లుకొన్న కదంబ వృక్షమై వూర్ధోన్ముఖయై వర్ధిల్లుతోంది. చిన్ని తన జీవన సౌరభాన్ని బావగారి ఇలవేలుపుల పరిచర్యలో అంకితం చేసింది.తన ప్రాపుకోసమెళ్లినా తన వసంత కుంజ మంజన క్రియలో అనవరతయై శోభిల్లతూ కుశలమడుగుతుందేమో. శిరీష
శిరీష కుసుమ పేశల మీమె సుకుమారము. పుట్టిన క్షణమున ఎగ్మోర్ ఆసుపత్రి నర్సమ్మలీమెను అరచేతుల నెత్తుకున్న ఒత్తుకునునేమో యని గుసగుస లాడి రట. ఈమాట ఈనోట ఆనోట విన్నది కాదు, పెద్దత్త, అంగల్లు గారు, అనపర్తిలో, సింహాద్రి బావ గారింట, ముచ్చట్ల మధ్య యన్నమాట.చిన్ని గురించి అచ్చమ్మాళ్ వదిన 'కళ గల పిల్ల రాముడు మామ మూడో కూతురు, అని బంధువర్గం లో ఉటంకించేది .) సరే , ఇక నా కథలోకొస్తే, పైన ఇరువురు, క్రింద నిరువురు. తరువాత నేనే పెద్ద నయ్యాను. పాలకొల్లు లో ముందు పాక ఇన్టి లోనున్నాము.
రాగద్వేషాలు పూర్తిగా వదిలేస్తేనే రసాస్వాదన సంపూర్ణం.
సంతోషాలు అనుమానాలు అవమానాలు అపార్ధాలు
అనుకోనిప్రయాణాలు
అనేకరకాలవ్యక్తులు
వారి ఆదరణ అనాదరణ
తిరస్కరణ వారి నిష్క్రమణ
వారి వలన
తామరతంపరగా వచ్చిపడిన సంఘటనలు
కొత్తవ్యక్తులు
అన్నిటిని గుర్తున్నమేర
గుర్తుచేసుకుని
హార్నీ అప్పుడెంతో ఖంగారు
దుఃఖాలకు
లోనయ్యారు
అని తేలికగా నవ్వుకోగలిగితే
కర్మబంధాలనుంచీ విముక్తి కలగవచ్చునేమో!
వివరమది పూరకమే.....విషయ పునరుక్తము కాదు సంగతుల నరయ ..వేరెవరు మూర్కొన విధిగాక..కలసి పెరిగి అలసి తరిగి విరుగు ఆనాటి కలల బాల్యము..ఒకనాటి విద్యానవము.కనమూ నేడ 'ని నే చిన్నపాట( తుని పట్టణ ప్రాపున మన మున్న తరి, )మనసును కలచివేయు నీనాటికి. పెద్దక్క కన్నీటి వరద విధికేదురీతకి సాక్షిని..
ఔను కేవలం
సాక్షీభూతులు నిత్యసంతుష్టులు
రాగద్వేషాలు వదులుకున్న మరుక్షణం
చేరుతారు ఆనందార్ణవం
కేవలం సత్యదర్శనం
చేయగలదు సర్వబంధ హననం
సర్వదుఃఖ హరణం
చేర్చగలదు ఆవలితీరం
గిరిన తరువు ఒరిగిన గిరికేమి వొనరు ఒకపరి చిరిగిన బ్రతుకు మరిమరి తవిరినయూపిరిలుడుగువారు తండ్రి,యామె తల్లి విధివ్రాసే కథ పలు విధముల మలుపుల మాటు చెలగాటమున. పరికించి చూచిన తనయూహల మించి కథ యొకటి నడుచు, మదినెంచని మనుజులు కూడి విడివడుచు, వృద్ధియొ కృద్ధమొ సిద్ధమగు క్రొంగొత్త చివురులు, వేనికి బంధములు జీవికి,? తన హృద్భాషన ఘోషిల్లును తనదో తన మనమున నిలచిన ఘనరూప భ్రాంతిదొ నిద్రన సైతము నిలువరించు జ్ఞాపిక.
. పాకవెనకాల నీళ్ల కాలువ ఉండేది. మొక్క మొటీకా కొట్టించి శుభ్రం చేయించి నట్టు న్నారు కాలవకి నా పచార్లు మొదలయ్యాయి. లోతు ఉండేది కాదు ఎవరి వెనకలో పోయే వాడినేమో సత్యాన్నడగాలి . ఒకసారి జలగలు పట్టుకున్నాయి నాకాలిని . పీకితే రావే. నొప్పిని లేదు కానీ కొంచం కొత్త చేత భయం పడ్డాను. సత్యమే ననుకుంటా అమ్మ దగ్గరకి తీసుకెళితే పసుపు రాసిందో ,ఇంగువ పూసిందో జలగనే లాగిందొ కానీ బతికి బయటపడ్డా.జలగలు ఇంట్లోక్కూడా వచ్చేసేవి. ఒకసారి అమ్మ వంటిల్లు చూడమని ఏదో పని మీద పెరట్లోకెళ్లింది. చద్ది అన్నం గిన్నె పొయ్యి పక్కన వుంది . ఒక గోధుమరంగు కుక్క చొరబడి గిన్నెని కరిచింది. నేను దాని తోక పట్టుకుని లాగినా అది అన్నం గిన్నెని వదల్లేదు. నా కేకలకి అమ్మ పరుగెత్తుకు వచ్చింది. కుక్క గిన్నెతో సహా పారిపోయింది.నేను చిన్నాన్న గారి పాపాయి ఆకుక్కని గుర్తుపెట్టుకు కనబడిందాక వెతికి రాళ్ళతో దాడి చేశాము. పెరట్లో వరల నుయ్యుండేది. అమ్మ గిన్నెలక్కడే శుభ్రం చేసేది. అప్పుడప్పుడు కాకులు చెంచాలు నెయ్యి గిన్నె ఎగరేసుకు పోయేవి. నేను పక్కింటి పెరట్లో గట్రా వెతికేవాడిని. పాకింట్లో వుండగానే నాకు జబ్బు చేసింది. లివర్ కంప్లైంట్ అనుకున్నారు. చిన్నన్న గారు భుజంమీదేసుకుని ఆసుపత్రికి తీసుకెళ్లి ఇంజెక్షన్ చేయించేవారు. నాకు పొడుగు లాగూ కట్టించారు. నేను జలగల భయమో, బెక బెక కప్పల, కీచు రాయల భయానికి నా కలవరింతల కారణమోగాని , ఇల్లు మారిపోయాము. ఈసారి పెంకుటిల్లు. ఎడమపక్క వాటాలో ఉండేవాళ్ళం. . పాప్లీ పుట్టినరోజు భారీ గా జరిపించారు. అమ్మ అక్కలు అప్పచ్చులు చేశారు. తలంట్లు తప్పలేదు. పాప్లి పుట్టినరోజు పండగ ఇక్కడే ఘనంగాజరిగింది.సంవత్సరం జరిగిపోయిందపుడే మద్రాస్ నుంచొచ్చి.
తాతగారగారు వచ్చారు. ఆయనకి కాకీ కాన్వాసు బూట్లుండేవి. నేను ట్రై చేసేవాడిని. ఆయనకి పెద్దక్క అంటే చాలా మక్కువ. ఓరోజు ఇంట్లోకొంచం హడావుడి. అక్కని వారగా కూర్చోబెట్టారు.అక్క కొంచం దుఃఖము గా ఉన్నది. తరువాత అక్కకి స్నానం చేయించారు.పిన్ని వాళ్ళు వచ్చారు. అక్క ఇంకా ఇంకా ఎవ్వరితోటీ మాట్లాడటం లేదు. తాతగారు మన్నన చేయబోతే పెరట్లో కొబ్బరిచెట్ల దగ్గరకు పారిపోయింది. తాత గారు పాపము కొంచం సేపు ఓదార్చే ప్రయత్నం చేశారు. . సత్యానికి నాకు బడి హడావుడుండేది. నాకు బళ్ళో ఎక్కాలు ఆ ఆ లు , పాటలు లీలావతి పంతులమ్మ గారు నేర్పించేవారు. మేము చాలా ముందే బడికి వెళ్ళి అరచేతులతో క్లాస్ రూమ్ శుభ్రం చేసేవాళ్ళము. గచ్చి మట్టి నేలో గుర్తు లేదు. అబ్బులు నాల్గో క్లాసో మూడో క్లాసో. వాడికి చాలా విషయాలు తెలుసు. గోడింబిల్లా ఆట, బచ్చాలాట, కాలవలో ములుగీత వాడిని లీడర్ చేసేసాయి.చిన్నన్న గారి పాపాయి ఇవేమీ రావు.నేను అబ్బులు చేసేవన్నీ ట్రై చేసేవాడిని. వాడిదగ్గర అప్పుడపుడు డబ్బులుండేవి. పెద్దది బేడా. వాడు కొన్నుక్కు తినేవాడు. ఎప్పుడూ వాడేమీ కూడా తిరిగే వాళ్లకు పెట్టిన గుర్తులేదు.సత్యం నన్ను రెక్కలట్టుకు బడినించి కొన్నాళ్ళు ఇంటికి తీసుకెళ్లినా తరువాత తరువాత ఒంటరిగా ఇంటికెళ్ళే వాడిని. గురింబిళ్లా ఆటలో డేక్కుంటూ బ్రహ్మాడి కొట్టుదాకా వెళ్లిన సందర్భాలెన్నో ఉన్నాయి. మెయిన్ రోడ్డుమీద అంటే రైల్వే స్టేషన్ కి వెళ్ళే దారిలో బ్రహ్మడి కొట్టు ఉన్నది. నేను అప్పుడప్పుడు సత్యంతో వెళ్ళి కొబ్బరికాయ పప్పు ఉప్పు కొనే వాడిని. అప్పుడు నా
కానీ , అర్ధణా,బేడాలతో కొనుక్కోవచ్చు అని తెలిసింది. ఒకరోజు వర్షం వచ్చింది. ఆరోజు బదిలేదు.పాపాయి, అబ్బులు,మడుగులవాడు,నేనూ కాలవకెళ్ళాము .నీళ్ళు తూము నిండుకు తోసుకుంటూ అవతలకురుకున్నాయి.(ఇంటి వెనకాల కాల్వ బడికెళ్ళే దారిలోనే. పొలాలకి, సిమెంట్ తూము పైనుంచి కాలవ దాటుకు వెళ్లాలి.) అబ్బులు నీళ్లలోకి దిగి తూము గుండా అవతల పక్కకి వచ్చాడు. నేనూ దిగి తెలీకుండానే నోరు మూసుకు కాళ్ళతో తూము క్రింది అంచును తన్నుతూ చేతులతో నీళ్ళని వెనక్కి తోస్తూ బయటకొచ్చాను. పాపాయి నాచెయ్యట్టుకు ఇంటికి తీసుకొచ్చాడు. నేను తడికి చలికీ కొంచం వణుకుతున్నాను. అప్పుడు వెర్రి వెధవాయనీ అమ్మ నా తల తుడిచింది. తరువాత కాలవలో ఈతలు కొట్టే అవకాశం ఎప్పుడో వచ్చింది
పాప్లీకి నడకొచ్చింది. పాలకొల్లులో రైలు గేట్ దాటింతరువాత హైస్కూలు తరువాత మిషన్ హాస్పటల్ తరువాత లాకులు ,లీలా మహల్ సినిమా హాలు, బోస్,నెహ్రూ,గాంధీ ల బొమ్మలు, పెద్దగోపురం చిన్న గోపురము మారుతి టాకీస్ ఉండేవి.పెద్దగోపురం శివాలయంలో సంక్రాంతి ముందు నుంచి శివరాత్రి దాకా ఉత్సవాలు జరిగేవి. పెద్ద గోపురము ఇరుకు మెట్లబచుట్టుతో ఉండేది.పెద్దక్క సత్యంలతో ఒకసారి గోపురమెక్కాను.చాకలి దాడు గారు హరికథ చెబుతూ సినిమా పాట వరస లతో భక్తి పాటలు పాడేవారు. చిరుతలు కొట్టేవాడు. అబ్బులు గాడు నాపరాయిలతో అలాగే కొట్టేవాడు.పాలకూర పాటవరస తోటి ఉపాటుండేది,ఓంహరాశంకరా పాట కూడా పాడేవాడు. డాన్సు చేసే వాడు. హరికథ కెళ్ళాలంటే చాలా హడావుడివుండేది.చాప హరికెను లాంతరు, కర్ర మంచినీళ్ళ చెంబు ఇన్ని దాలని తాతగారి రూల్. నేను చిన్నీ నిద్రపోయేవాళ్ళం.
చిన్నన్న గారు చార్మినార్/ దక్కన్ సిగరెట్లు కాల్చేవారు. ఖాళీ పెట్టెలతో పిన్ని బొమ్మలు చేసేది.గుర్రం రధము అలాంటివి. నాకు అబ్బులు సిగరెట్బపెట్టే, బచ్చాల విలువ ఉపయోగం మారకం నేర్పించాడు. అవి ఎరడంకోసము లాకులకెళ్లే వాడిని. గుండె మార్కు గోల్డ్ ఫ్లెకూ, సీజర్స్ చాలా విలువైనవి. నేను డబ్బులు గురించి కూడా గ్రహించాను. నాన్నగారు డబ్బులు తెచ్చి ఇంట్లో గడిపిన బొమ్మలు పెట్టుకునే అరవుండేది, దానిపైన చిల్లరగా పోసేవారు. అవి గుప్పిడితో తీరుకు ఒకసారి బడవతల బ్రహ్మాది కొట్టుముందు హోటల్లో అబ్బులకి, మడుగులాడికీ సూరిగాడికీ ఇద్దెన్లు బర్ఫీ పార్టీ ఇచ్చాను.పాపాయి గాడు తిన్నాడో లేదో గుర్తు లేదు గాని పిన్నికి ఆవిడ ద్వారా అమ్మకే కంప్లైంట్ చేసాడు.నేను పాడైపోతున్నానని నాన్నగారికి అమ్మకీ తెలిసిపోయింది. తరువాత నాన్న గారు నన్ను సత్యభామ అత్త వాళ్ళింట్లో హిందీ ప్రైవేట్ లో చేర్పించారు. ఆయనా తాతగారే. నాన్నగారి పిన్ని మొగుడు. ఐతే సత్యభామ అత్త దేవతలాగ ఉండేది.చిన్నప్పుడు ఆడవాళ్ళదరూ అక్క సత్యాలతో సహా దేవతలని ఘాడంగా నమ్మే వాడిని. సత్యభామ అత్త నిజంగా అందగత్తేను. ఆవిడ నన్ను దయగా చూసేది. .
తరువాత భాగానికి ఎదురు చూస్తున్నాం
ఈ విషయాలేమీ మాకుతెలీనేతెలియదు
సరే,నాన్నగారికి ఉద్యోగం లేదు కదా, మరి ఎవరు పరిచయం చేసారో తెలీదుకానీ, దొడ్డిపట్ల జమీందారువగారి అమ్మాయిcకి మెట్రిక్యులేషన్ పరీక్షకు తర్ఫీదు ఇవ్వాలని నాన్న గారికి పిలుపొచ్చింది. రోజూ వెళ్ళేవారు. గమ్మత్తుగా పిల్లతో పాటు తల్లి కూడా చదువుకు సిద్ధమయ్యింది. నాన్నగారితో బాటు నేను సత్యం ఓరోజు వెళ్ళిన గుర్తు. గోదావరి ఒడ్డును ప్రసుకు దొడ్డిపట్ల గ్రామముంటుంది. జమీందారు గారిది పెద్ద ఇల్లు . హాలు మధ్యలో స్తంభాలతో విశేషంగా ఉండేది.
No comments:
Post a Comment