Mohan: చెప్పింది వింటాం
వింటూనే ఉంటూంటాం
నాడు మరిచాం
ఐకమత్యం గా ఉండడం
ఇప్పుడుగుర్తించాం
అమ్మ దిశానిర్దేశం
గందరగోళం పడ్డాం
గొడవలూపడ్డాం
కాలం తిరిగింది
రోగం కుదిరినట్టేఉంది
నేడు కావలసింది
మనం పట్టుకోవలసింది
ఉత్సాహం
పునశ్చరణం
ఔషధ సేవనం
ప్రశాంత జీవనం
అదీ బదనిక. వదులైన బొందులేని లాగు. లాంగూల బంధిత శంగోళము. మనసది కుదురెరుగని విపంచిక. దానిని గాటనుంచ చీకటి చెన్నుగాని ప్రియ చెలిమి చేత వలనౌను
కృష్ణుడెలా వుంటాడు?
Mohan: కదా!
జరిగేది
జరిగినది
ఒకతీరైనది
జరగనున్నది
ఏతీరన్నది
ఎవ్వరెరుగనిది
కాలపుతీరది
నీకుతెలియనిదేమున్నది
మనచేతనేమున్నది
మనః చేతనా సరళి
ఏమాత్రము తెలియదది
సాక్షీబావన
స్ఫురించినమది
నిత్యానందఝరి
సరి సరి మరి
ఏ రీతి వికసించు నది?
కృష్ణుడేలాగుంటాడు. ఇలాగున
భుజమొక్కింత కించెజేసి ... .. కుడి పిడికిలి మడచిదాని నొద్దికిన చుబుకమునెత్తి ఎడమచేతిని
ఘనమగు జఘనమున చేరిచి సోగ కనులరమూచి బుంగ బుగ్గల నీలి జిలుగులు జాలువార ఆనంద సముద్రమున చిరునగవుల వెన్నెలొలికించు వన్నెకాడే వాడు నల్లనౌ గాక మెల్లనౌ గాక చల్లనివాడె జగతిన జేజలెల్లరకు ప్రీతిగూర్చేడి గీతకాడు
సత్యం చెప్పిన సూచనకి ఇచ్చిన విన్నపము
అలాగే , సత్యం
ఓ చిన్న విషయం
మనింట్లో అందరం
స్మృతుల నమాహారం
అక్షరబద్దం చేద్దాం,
ఇది ఒక మహా యజ్ఞం
మనం సాక్షీ భూతులం
మనందరం ప్రతి ఒక్కరం
యజ్ఞంయాజ్ఞికులం అనే భావన తో ఆరంభించాము కదా!
“అనుజులు బుత్విజులుగ,పని ఇటుసేయమను నీ వుపద్రష్టవుగా
విను ! అరి షడ్వర్గ పశువిశ
సనమున రణయాజ్ఞీ సత్యమ సమ్మతి జేయున్
(తిక్కన సోమయాజి శ్రీమదాంధ్ర మహా భారతము vol -7 ఉద్యోగ పర్వము pp 528
-45 కొద్దిగా మార్చి సందర్భానికి అన్వయించి)
భావముః
సత్యం ! విను.
తన తమ్ములు నలుగురు హోత ,ఉద్గాత,అధ్వర్యువు,బ్రహ్మ అను యజ్ఞంచేయుంచే యాజకులుకాగా ఈ పని ఇలాచేయండి. అని యజ్ఞకర్మలోని గుణదోషాలను కనిపెట్టి చెప్పే ఉపద్రష్టవునీవు కాగా అరిషడ్వర్గాలు అనబడే పశువులను విశసించి సంప్రీతితో చేసే కావ్య యజ్ఞము ఇదీ .
అని గుర్తించప్రార్దన!
Mohan: సత్యం జవాబు
జరిగిన విషయాలు గుర్తు వస్తే తల నొప్పి వస్తోందిరా మా నూ! ఏం తలుచుకోను. సుందరకాండ రాసుకుంటా! భాగవత కథలు టైపింగ్.. రామా! కృష్ణా! ఇంత ప్రసాదం వేడిగా పెడుతుంది. కంట్లో మందేస్తుంది! మనవరాళ్ళు కృతులు పాడతారు' వాళ్ళతో ఆట..పాట 'అంతే నిద్ర తన్నుకుని వచ్చేస్తుంది. రోజు పూర్తి
Mohan: బహుబాగుంది
అలాగేకానీ
మనకు ఏదిహితవో
అదేహితవు
సినీమా చూసే మనిషికి
ఆనందం కలగ వచ్చు
ఉత్కంఠత కలగవచ్చు
ఉద్వేగమూతలుగ వచ్చు
ఐతే సినీమా చూసేది కేవలం వినోదార్థం
కొన్నిసందర్భాలలో
విజ్ఞాన్ సముపార్జనార్దమూ
కావచ్చు
కానైతే చూసే ఓపిక ఆరోగ్యం
ఉండద్దూ
రెండూ దూరమయ్యే భయం ఉంటే
నచ్చిన చోట, నచ్చిన పని!
విశ్రాంతి !!
కృష్ణారామా
అయ్యోరామ!
ఏదీ మనసుకు తీస్కోకు
: 1963....నూజివీడు నుంచి వీరవాసరం ప్రయాణానికి బందరు బస్సెక్కించారో మేమే బస్సెక్కమో గుర్తు లేదు. గోనె సంచీలో వంట పాత్రలు, బట్టల సంచీ ఒకటో రెండో మూటలు ఇవీ మోతకి, పట్టుకోవడానికి మోహన్ చిన్ని శిరీషు బట్టర్ బుద్ధిగా అమ్మ పక్కనే ఉండేవాడు. వీడి పేరు తలుచుకుంటే మనసు చల్లబడి కళ్ళు చెమర్చుకుపోతాయి. ధీమతి తొందరగా రుణం తీరిపోయిన బంగారు తమ్ముడు. ఎంతటి గాయం, వాడి ప్రాణం కరిగిపోవడం.( పెద్దక్క చిన్న ప్రపంచంలో వాడికి పెద్ద ప్రేమ సింహాసన ముందేది. దొడ్డం మామ వాడికి అంతిమ సంస్కారం చెయ్యడము చెరగని విషాద కావ్యం).గుడివాడలో నర్సాపూర్ డీసెల్ కారు ఎక్కాము.చిన్ని పెద్ద దిక్కే,మొహాన్ని పట్టుకుంది. అమ్మ చేతిలో చంటిది. దాని పేరు గురించి నాయనగారికి అమ్మకీ రాజీ కుదిరి మాధవీ అనే మాధవీ కుట్టి అని పిలుచుకునే వాళ్ళం
: సామానుతో రోడ్డు మీద బస్సు దిగాము. స్టేషన్ దగ్గరో దూరమో తెలీలేదు.కానీ జాగ్రత్తగా అమ్మ వెంట దారి తీసాము. గల రైల్వేస్టేషన్ చాలా పెద్దగా ఉంది. జంక్షన్ కదా. రైలు పట్టాలు దాటడం అవీ ఏమీలేదు .ఓవర్ బ్రిడ్జి ఎక్కిన గుర్తు లేదు.రైలెక్కడమూ,తలుపుకు కొంచం దూరంగా కూచుని చీకట్లోకి చూస్తుండగానే భీమవరమొచ్చేశాము. తెలిసిపోతోంది. వీరవాసరం అక్కడకి 7మైళ్ళు.అమ్మ వళ్ళో మాధవీ, ఆనుకొని మోహనూ,నిద్రలోనేవున్నారు. నేను అంతకృతము ఒంటరిగా ఒకసారి వీరవాసరం వెళ్ళి తాతారావు దగ్గరినుండి డబ్బులు తెచ్చాను. వీరవాసరం వచ్చేముందు ఊళ్ళు నాకు గుర్తే. భీమవరం చాలాసేపు ఆగింది. వీరవాసరం vachesariki తెలిసిపోయింది.రిక్షా కట్టించుకున్నామేమో, తాతారావు ఇంటికైతే వచ్చాము. తాతారావు నేనూ కరణం ఆచంట సూర్యనారాయణ గారి ఇంటికొచ్చాము.అప్పటికి ఎండబాగా వచ్చింది. సూర్యనారాయణగారి ఇంటె దురుగుండా కొంచెం చోటు జారిన పెంకుటిల్లుంది. దానిని మనకడ్డెకిచారు.6 రూపాయల అద్దె. అమ్మ పిల్లలు తాతారావు కొడుకు సాయంతో సామాన్లు పెంకుటింట్లోకి వచ్చేశాయి. బియ్యము కూరలు కొన్ని తాతారావు పంపాడు. వాసానికి చీర ఉయ్యాల వేసి మాధవిని పడుకో బెట్టింది అమ్మ. తాతారావు ఇంటిదగ్గర పెద్ద మంచినీళ్ళ చెరు ఉంది.నేనూ చిన్నీ రెండు బిందెలు తీసుకుని నీళ్ళు తెచ్చాము. ఆ ఇంటి వెనకాల చాలా పెద్ద పెరడు. పెరట్లో పుల్లలు పోగుచేశాము. విస్తికాయల మొక్కలు, బొప్పాయి చెట్లు, ఒకటో రెండో కొబ్బరి చెట్లు దొడ్డంతా సవరించుకుని ఉన్నాయి. ఏమో వండిందమ్మ. స్నానాలు చేసాము. చెరువు నీళ్లే అన్నిటికీ వాడేవాళ్ళము. కరణం గారింటికి ఒక 100 గజాల దూరం చెరువు గట్టు. చిన్న సందు తిరిగితే వచ్చేది .
No comments:
Post a Comment