Monday, December 29, 2025

H. Page 1

 నాన్నగారండీ, ఎంత తియ్యని పిలుపు

రాముడు మామా ఆత్మీయ సంబోధనే
ఆచార్లుగారు చెప్పుల్లెకుండానే తిరిగేవారు
ప్రవాసమెక్కడ మొదలయ్యిందో తెలీదు కానీ
నలభయ్యేళ్ళు కలిసీ విడి విడిగా ప్రయాణించాము
పదహారేళ్ళుగా కలలలోనే సావాసమండీ
మెలకువ సంగతి తెలీదుకానీ శుషుప్త్యావస్థలో 
కల లాంటి మెలకువలో కనిపిస్తూనే వుంటారు
ఎవరి తండ్రి యెవరికి మంచి కాదు
రాముడుగా, మామగా,రామాచార్లుగా,తాతగారుగా
తల్పూ తియ్యండీ మాష్టారూగారూగా
గున్నయ్యగారబ్బాయిగా హిందీమాష్టారితమ్ముడుగా
ఆయన అందరినోట్లో నానే వారు,అవునూ
అంగల్లుగారూ,మంగత్తగారూ గారాబం చేసేవారట
సత్యభామ వదినా అచ్చమ్మాళ్ళూ రంగయ్యబావా
సింహాద్రి బావ  మరీ చనువే ఏరా మామాఅని
గుండెలకి హత్తుకునేవారు కానీ దాసూ కిష్టీ 
ఒరే మామా అంటే ఓర్చుకోలేకపోయే వాడిని
అయినా వాళ్ళ అనుబంధం వాళ్ళది
అయ్యంగార్లిద్దరూ పాలకొల్లు పరిచయం
కనకంవదినె సంగతి తెలీదు కాని పిల్లమ్మంటే
చెల్లంమ్మంతా పాపంతా మాఅమ్మకి ఇష్టం
మొన్నెప్పుడో పిల్లమ్మ వదినింటికెళ్శినప్పుడు
అంటే నలభయ్యైదేళ్ళతర్వాతన్నమాట
మా రాముడు మామ కొడుకొచ్చాడని సంబర పడింది
ఒక కలలాంటి నిజమైనఅనుభూతి లో మునిగానండీ
రాత్రి మా నాన్నకలలో కని పించి పలకరించె సరికి
జాషువా గారి సత్య హరిశ్చంద్రుడి 'లేచిరారే అయ్యో'
బలిజె పల్లి వారి గళ ప్రవాహం రాత్రి మరిన్నిసార్లు విన్నా
నాన్నగారూ నేనూ యీ సీను పిఠాపురంలో చూశాము
కాని నిజమైనకలలో కాసేపు ప్రసన్న దర్శనాన్నిచ్చారు

No comments:

Post a Comment