Monday, December 29, 2025

H. Page 3

కొన్నాళ్ల తరువాత తెలిసింది జమీందారి భార్య సెకండ్ క్లాసులోనూ కూతురు థర్డ్ క్లాసులోనూ ఆంధ్ర మెట్రిక్యులేషన్ పాలయ్యారని.
 మళ్ళీ ఒకరోజు నేను నాన్నగారితో దొడ్డిపట్ల వెళ్ళాను. జమీందారు గారి కూతురు పెళ్ళి. ఎన్నెన్నో గ్యాస్ లైట్స్. బాజాలు.టపాకాయలు తారాజువ్వలు బాంబులు చెప్పలేనంత హడావుడి., నా బుర్ర బద్దలైనట్లని పిన్చింది.గట్టిగా చెవులూసుకుని నాన్న గారి పక్కన నిద్రపోయాను.  ఆనక ఇంటికొచ్చాము
 తాతగారిని మమ్మల్నీ చూడడానికి చిన్న బావ వొచ్చాడు. ఆయన చాలా పొడుగు.ca

 ఆయన హైదరాబాద్ ఆండాళ్ అత్తగారి పెద్ద కొడుకు. ఈయన చెల్లెలు పిల్లమ్మ  మదరాసులో మన ఇంట్లో కొన్నాళ్ళు వుందట. నాకు గుర్తు లేదు. అమ్మకి చాలా సాయం చేసేదట.  చిన్న బావ పాప చెల్లెమ్మ లకు బాగా తెలుసు. బావ గారూ చిల్లు చెంబులో నీళ్ళున్నాయి కాళ్ళు కడుక్కొండని వేళాకోళం పాట పాడేవారు. ఆయన  చిరు నవ్వు మొహం  మళ్ళీ దాదాపు 20 ఏళ్ల తరువాత హైదరాబాదులో చూసాను.


అమలాపురం నుంచి   సుభద్రత్త గారి  కొడుకులు అంటే  పెద్ద అయ్యగారు బావో లేక రామంజమో ఒకసారి వచ్చినట్లు గుర్తు. ఈలోగా వాన కాలమొచ్చింది. ఆ ముసురుగా ఉంది. నాన్నగారు చిన్నాన్న గారు హడావుడిగా మా బడి వైపు వెళ్ళారు. నేను వాళ్ళకి తెలీకుండా కూడా బడ్డాను.   మాబడిపక్క మనవాళ్ళే వైష్ణవులు , పెద్ద రోడ్డు  వైపునున్న  ఇంట్లో ఉండే వారు. వాళ్ళింట్లో ఎవరో పరమ పదించారు.  ఆరోజు వాళ్ళని ముట్టుకోకూడదట. అంటే మది లాగే. అమ్మమ్మ తునిలో వంటచేసే డప్పుడు, పూజ చేసుకునే దప్పుడూ మడిగట్టుకునేది. ముట్టుకుంటే  మళ్ళీ స్నానం చేసి  ఆవిడ ఉంగరాల  చిత్ర  జుట్టంట నీళ్ళు కారుకుంటూ . వంటిలో కొచ్చేది. ముట్టుకోద్ద అప్పచ్చు లిస్తానని బతిమిలాడేది. సరే అని నెమల్లారి చేసే వాడిని కాదు.

మరిఆరోజు నాన్నగారు మైల అన్న మాట. చావు విషయమై పాపాయి నేను మాట్లాడుకున్నాము. అదే మొదటి సారి వినడము.ఇంట్లో అపశబ్ధాలెవ్వరినీ మాట్లాడ నిచ్చేవారు కాదు తాతగారు. ఆఖరికి పెద్దక్క కథ చెప్పేటప్పుడు కూడా. అన్నట్లు పెద్దక్క చాలా సినిమాలు చూసేది. మాకు కళ్లక్కట్టినట్టు సినిమా కథ చెప్పేది. ఇతర కథలు కూడా. నేను పెద్దయినట్లు నాకు బాగా తెలిసిన సంఘటన. పక్కతదపడం మానేశాను అమ్మకి సాయం సత్యం తో పాటు అక్కతో బాటు చేసేవాడిని. ఒక్కొక్కసారి నా అంతట నేనే. C

పాలకొల్లుపిన్ని పాప చెల్లెమ్మలు అప్పుడప్పుడు పక్కలు తడిపినప్పుడు అమ్మతో చెప్పి చీకాకు పడేది. వాళ్ళు తెల్లారే లేచి వాళ్ళ బొంత వాళ్ళే ఊరుక్క ఆరేసుకునే వారు. అయినా పిన్ని ,అయ్, అనేది.

పిన్నికి నరసాపురంలో మంగమ్మ గారనే అక్క,ఉండేది రామానుజం శ్రీనివాసు ఇద్దరు కొడుకులు. వాళ్ళు చెల్లెమ్మ వాల తో బాటు నన్ను బాబు బర్రూ అని వెక్కిరించేవారు. వాళ్ళ  నాన్న  కందాళ వాసుదేవాచార్లు గారు. ఆయన ప్లీడరు. కోనేరు ముందు ఇల్లు. వాళ్ళింటికి ఒకసారి నన్ను సింహాద్రి బావా వాళ్ళ అమ్మగారు అంగల్లు గారు , చంకనే సు కుని తీసుకెళ్లారు

 అక్క10 వ తరగతి పరీక్ష పాసవలేదనుకుంటా. తరువాత 2nd లిస్టులో neeperudanna ఆవిడ దుఃఖము తీరలేదు. తాతగారో  నాన్నగారో గుర్తు లేదు కానీ నన్ను అక్కని నూజివీడు తీసుకు వచ్చారు. నూజివీడులో మన ఇల్లు చాలా పెద్దది. ముందొక ఇల్లు వెనకొక ఇల్లు. ముందు ఇల్లు వేంకటేశ్వర స్వామి కోవెల కి పాటుగా ఉండేది. వెనక ఇల్లు సిబ్బందీల ఇళ్ల వీధిలో ఉండేది. సాయబుల రావి చెట్టు  మన ఇంటి వీధి వైపు కిటికీ లోంచి చూస్తే కనిపించేది.. మన ఇంటిలో నా ఎత్తు గడ్డి. మేమొచ్చామని తాతగారు తిరుపతి( ఎరుకల వాడు) పిలిచి  గడ్డికోయించారు.  నాన్నగారు కనీ పించలేదు అంటే తాతగారే మమ్మల్ని నూజివీడు తీసుకొచ్చారన్నమాట. అక్క కుంపటివెలిగించి అన్నానికి ఎసరు పెట్టడానికి నీళ్ళు గిన్నెలోకి వంచింది. ఆ నీళ్ళు ఎర్రగా ఉన్నాయి అంతేకాదు , నీళ్ళల్లోంచి రెండో మూడో చేపలొచ్చాయి గిన్నెలోకి. అక్క నేనూ ఆశ్చర్యపడి తాతగారికి చెబితే ఆయన కాషాయపు ఖండువా తో నీళ్ళని వడ గట్టి ,నీళ్ళల్లో ఇందుప గింజరగదీసి వేశారు. తర్వాత అన్నం వండిందక్క. 

No comments:

Post a Comment