నా స్వగతం మళ్లీ గళ మెత్తుకుంటోంది. వినే ఓపిక ఉందా?
Mohan: బ్రహ్మాండంగా ఉంది
దయ ఉంచి కొన సాగించగలవు
ఎర్రటి ఎండలు మొదటి సారి నూజివీడు లో చూసాను. అది1959 ఏప్రిల్ మే నెల్లలనుకుంటా. జంగాల్ పేటలో కొంపలన్నీ తగలడిపోయాయి. ఆకాశాన్ని చుట్టేసిన పొగ మన పెరట్లో పడుతున్న తాటాకుల బూడిదా కళ్ళముందు కదలాడుతున్నాయి. నాన్నగారు హందాలోకి నీళ్ళు తోడి పెంకులపైన జల్లుతోంటే నేనూ చెంబుతో నీళ్ళు విసరడం గుర్తుకొస్తోంది. సీతా ఫలాల కాలం నుంచి మామిడి పళ్ళ సీసాన్లోకొచ్చాము.ఉగాది పండగ తర్వాత ఎండల్లోవచ్చిన పండగ రామ నవమి. పదిరోజుల ముందునుంచి బడిలో పిల్లలు కొంతమంది, అలగా పిల్లలు కొంత మంది కలసి ఒక దీపపు సెమ్మ పట్టుకు ఇంటింటికీ తిరిగి డబ్బులు పోగుచేసి రామనవమి పండగ చేసేవారు. నూజివీడులో మోహన్ కొత్తగా తమ్ముడయ్యాడు.వీడు పుట్టేదాకా తాతగారు మనిన్ట్లోనే ఉన్నారు.ఇత్తడి కప్పులున్న ఎత్తు చిలకల మంచం, ముందు వసారలో ఉండేది. దాని క్రింద ఆయన కాకీ కాన్వాస్ షూస్ రెండు జతలుండేవి. కళ్ళజోడుని సులోచనాలనేవారు, దానికి దారముండేది. ప్రక్కన ఒద్దికగా పెట్టుకునేవారు.ఎంరాసేవారో, ఉత్తరాలు మరేదైనా నో తెలీదుకానీ busy gaa ఉండేవారు.
1960 నా చదువు. భం. పు. రావు గారి దగ్గర into ఫస్ట్ ఫారం కోచింగ్. 4 రోజులే. ఆరోజు, బండ వెధవా, అని తొడపాసం పెట్టారు. ఇంటికొచ్చాక పెద్దక్క చూసి ఇంట్లో తనే నేర్పించింది పరీక్ష పాస్ అయ్యాను. రంగన్న గూడెంలో నాన్న గారి ఉద్యోగంతో నా హై స్కూల్ చదువు చెల్లిపోయింది. పదినెల్ల తరువాత తిరిగి నూజివీడు వచ్చేసాము. మళ్ళీ రోజులు తిరగడం బొజ్జల నిండడమూ కష్టమైపోయాయి. రాజ్యలక్ష్మీ ట్యుటోరియల్ మోనో స్టూడెంట్ డబుల్ నెంబర్ అటెండెన్స్ తో మిసరబుల్ ఫ్లాప్ అయ్యింది. జ్యోతిష్యపు అంకం మొదలయ్యింది. నోట్ మేకింగ్ ఒక ధ్యాస ఆశ . ఆరోజుల్లో డోలాస్ నగర్లో ఎవడో జ్యోతిష్కుడుండెవాడు. నాయనగారి ఇన్స్పిరేషన్. సరే నాయన గారు నేనూ గుంటూరు వెళ్ళాము. రంగయ్య బావ పరిచయమయ్యాడు. ఎంత వెతికమో బావ ఇల్లు కనుక్కోడానికి. బావా నాన్నగారు o రెండ్రోజులు బయట తిరిగారు. ఏమైందో తెలీదు కానీ అక్కడ నుండి తిరిగిచేసాము. నాకు మొదటి సారి సైకిల్ పట్టుకోవడం , శంకర్ కేఫ్ దగ్గర ప్లై ఓవర్ మెట్లెక్కించడం తరువాత జిన్నా టవర్ దగ్గర గ్రౌండ్లో సైకిల్ నడిపించదముక్రంగయ బావ నేర్పాడు. బావ సీతక్క,పెద్ద సత్యాదేవి, చిన్న సత్యాదేవి చాలా స్నేహితంగా ఉన్నారు. బావకి దొర టోపీ ఉండేది. బావ ఇన్స్పెక్టర్ అందుకని దొర టోపీ వేసుకోవాలి అని నాకు అర్ధం అయ్యింది.
నూజివీడింట్లో పెద్ద దూలము కుడిపక్క గోడ పెద్దగా పెట్లిపోయింది. దూలం పడి పోతుందని చాలా భయపడ్డాము. కానీ ఖర్చు వ్యవ గారం కదా, ఐతే ఓ రోజు ఒక ఇన్స్యూర్డ్ కవర్ వచ్చింది. తాతగారు కొన్ని పెద్ద రూపాయలు, పంపారు. వీరవాసరం పొలాల గురించి అప్పుడు తెలిసింది. మనకి కూడా పొలాలు ఉన్నాయి. అక్కడికెళ్లి ఉండచు అనే సంగతి తాతగారు పార్టిషన్ చేయించిన తరువాత తెలిసింది. గోడకట్టడము నాన్నగారికి బాధకలిగించింది. తరువాత ఓరోజు ఎలకలవాడి కొడుకు మేస్త్రీ నీ పిలిచి నాన్నగారు దూలం సపోర్ట్ గోడకి సిమెంట్ వేయించారు. ఒక పెద్ద సిమెంట్ మ్యాప్ గోదక లాగే ఉండిపోయింది.
ఆకలి తెలిసింది. నిద్ర తెలిసింది. కొత్త బంధువులు వారి ఉనికి తెలిసింది. చిన్నాన్న పాలకొల్లు, అక్కడ ఆటుపోటుల్లేని జీవితము ఉద్యోగం చేయడమూ లేకపోవడమూ తెలిసాయి.
సరిగ్గా గుర్తులేదు కానీ, రంగన్న గూడెం ఎపిసోడ్ తరువాత మనం వీరవాసరం వెళ్ళాము. అప్పటికి మాధవి పుట్టింది లేదో,,,సత్యాన్నడగాలి.
సత్యము జవాబు హాయిగా పిల్ల అల్లుడు.. మనవరాళ్ళతో సమయం సంతోషం గాగడుపు... అన్నీ తవ్వి తీసి మనసు.. ఆరోగ్యము పాడు చేసుకోకు.. లక్ష్మిని ప్రశాంతంగా ఉంచు.. ఎండవేళ వాకింగు చేసుకోండి ఇద్దరూ ఆరోగ్యం భద్రం, 1..శారీరికారోగ్యం
2. మానసిక ఆరోగ్యం
3. మందులు సమయానికి వేసుకో
4. ధ్యానం 1గం.. చెయ్యి
5. ప్రశాంతంగా కాలం గడుపు.
నా మనసు విప్పిన శృంఖల...బతుకు బండీ కాదు, చావు రేవూ కాదు నిజము నిప్పూ కాదు. చరిత చింతా కాదు నెమరు నొప్పి కాదు. నిద్ర దిగుడు మెట్ల వెంట వెనక్కి నడిపిస్తోంది .మెలకువ రేపటి ప్రయాణాన్ని గుర్తు చేస్తోంది. పోయినవాళ్ళు మరీ మరీ పలకరిస్తున్నారు. పెద్దక్క భట్టరు అమ్మా నాన్నగారు స్పర్శకి చేరువగా కళ్ళకెదురుగా ఇదే నిజమనిపించేట్లు రాత్రులు తెల్లారుతున్నాయి. పొగబండి , చీకట్లో ప్రయాణం . సామర్లకోటలో సామాన్ల దోపిడీ. మందులేసుకుంటే రాత్రులు పగలు గాను పగలు రాత్రిగానూ మారడంలేదు. తిరిగే కాలం ఆగి వెనక్కి తొంగిచూస్తోంది. పడక కుర్చీలో పండుకుని నాన్నగారు కానరావట్లే. హాయి ఎప్పుడూ పోయిందోయీ వెతుక్కో మళ్ళీ బాల్య మేమైనా తలుపు తడుతుందేమో చూడవోయంటోంది మనసు. సరే నువ్వు హాయిగా ఉండాలని సర్వేశ్వర ప్రార్థన చేస్తూ...
ఈ ప్రపంచంలోకి ఖాళీ సంచీ తో ప్రవేశించాము చాలా కలగలపు పోగు చేసుకున్నాము. వంటికంటుకున్నదీ మనసుకు ముసిరినదీ. ఉతికితే మిగిలున్నదీ దండంతో దారి వదిలినదీ లెక్క చేస్తున్నా.. అంతే...
No comments:
Post a Comment