Monday, February 18, 2019

In memory of the bombed soldiers who died on FRYDAY 14 TH FEB,2019 IN PULOMA

లవంచి పులకింతన ప్రణమిల్లుదు
గళమెత్తి ఘోషిల్లెద ప్రళయ నాదము
జయము జయము ఘన ఙ్ఞాన ప్రసూన
జయము జయము మునిగణ వందిత
జయము జనని జయము భారతి
వెలుగు మాటున తోకచుక్కలు జేరె
కలుగుమాటున పొంచి కాటముజేయ
....................................................
.................................................
----------------------------------------
పదాతి సైనికుడా నీదారి 
సుమదళసోభిత కాదుసుమా
తుఛ్ఛ మ్లేఛ్ఛ మృగాఛ్ఛాదిత
ఛాయా గ్రహణ అనుక్షణిక ఆహ్వానిక
చీకటి పుట్టనపుట్టి విషపాషాణ క్రోధం
నరనరాన నింపుకు చచ్చీ సాధించే
రక్త బీజుల పునరావాహక వేదిక!!
ఓసైనికుడా, అడుగడుగున మెలకువ
అలతి మాటకాదు సంకట
కంటక సంకలిత బాట

ఓ సైనికుడ నీకు నివాళులర్పింప
నెమ్మనము గీలించి యేడ్చుచున్నది.
గతి తార్కికత తప్పిన విధమేదని,నా
మదిని గృచ్చి గృచ్చి ప్రశ్నిస్తోంది వివేకము
మతి తప్పిదమునకు శతకోటి భరత
రతచోదిత మతులు వెత నొందిరో?
లేక కుల మత కీలల చలి క్రాగుచు
తప్పు తమ తమ నెలవుల కావల
యని పాలక శ్రేఢుల పరిహాస హాస
క్రియాలాపముల క్రీడింప నెంచెదరో!!
ఎన్ని రహస్యములపహాస్యములైనవో
ఎన్ని విధముల శతృమూకలకు లోకువైతిమో
సైనికుడా రక్ష రక్ష నీకు నీదిక్షకు!!
అన్నమేమిడితిమొ లేదొ యన్ని ప్రాణములొడ్డిరి!
ఎన్ని లోపములున్నను మీయాలాపన
నాదేశ రక్షణ నా వునికీ వూపిరుల రక్షణ
జయహో సైనికుడా జయహో
జయహో సైనికుడా జయహో
నీయశస్సుఆచంద్రార్కము
జయహో సైనికుడా జయహో
జయహోసైనికుడా జయహో
....................................................
....................................................

No comments:

Post a Comment