Monday, February 18, 2019

Satya Maringanti జ్ఞాపకాన్ని పంచుకున్నారు.

Satya Maringanti జ్ఞాపకాన్ని పంచుకున్నారు.



ధుఖఃతరంగాల అవల
స్ధబ్ధ నిరాసక్తతా విలంబనమో
నివురుగప్పిన నిప్పుల నెగడో
మనసా యెంత భావ విచలితవీ
కానీ సంతస హేల కనురెప్పల పాటే
సుఖధుఖాలు కర్మ కర్తా క్రియలా!

దిగులు మనసులో గూడు కట్టుకుంటుంది!
నవ్వుకీ ఏడ్పుకీ కన్నీళ్ళు తోడైతే,
మనసు ద్రవించిందని తెలుస్తుంది.
మనో మరీచికలని పట్టుకోడానికి
కవికుమారుడు అక్షరాలని పూసగ్రుచ్చితే,
చిత్రకారుడు రంగుల సంగతులు అవిష్కరిస్తాడు
. మనసు పాడే మౌన గీతానికి సంగతులివే!
కన్నీటి కెరటాల వెన్నెలా, నిట్టూర్పు ఘాడ్పులో నెత్తావీ
పురుడుపోసుకు అజంతా చిత్రా లూ హంపీ కన్యలూ పుట్టుకొస్తాయి
! దామెర్ల బొమ్మలూ,విశ్వనాధ స్వగతమూ
క్రొత్త తరపు తరంగాలైతే, శుక్ర నీతీ,వ్యాసగీతీ తపహ్ ఫలాలు
యాగ్న్య వల్క్య,ఆపస్తంభ, పరాశర సూత్రాలు
మానవ జీవన విధానానికి అపురూప ప్రమేయాలు!
-మనిషి మనసుని కడిగి ఆత్మదర్శనమే
ఆద్యంతమూ నాగరీకత లక్ష్యమని చెబుతాయి-
అంటే ఒకింత విచారమూ,బుద్ధికుశలతానూ
అట్టి కుశలత సాధకసిద్ధమనే గాధలేన్నో
వెతుక్కుంటేనే దొరుకుతాయి!,
మనస్సు శాంతమై శరీరము ప్రకాశిస్తుంది
ఆత్మావిష్కరణలో ధుఖమూ ,సంతోషమూ
రెండుకళ్ళనిండా కన్నీళ్ళు పెట్టిస్తాయి


No comments:

Post a Comment