Tuesday, February 19, 2019

Satya Maringanti


Satya Maringanti
జయమొక పురస్కారమె
ఆత్మైక్యభావన నెలకొన్న్న
స్థూల జగతి కృష్ణార్ణవ
ఫేన పుంజ తుషారద్యుతి
జననమె జయము అభయముగొన్న
అయ్యదియాత్మ సంచితము
ధరిత దేహమె సంచయనీకృత
కృత్యయన్న జడలు విప్పిన జడి
మనోబుద్ద్యహంకారముల జిగట ముడి
పరిమాణమే పరిణామ ప్రమాణము
ఒక్కటియొక్కటియె నొక్కటి తక్క
కలసి విస్తృతమై అనంత భంగులగు
గుణాత్మకమై భిన్నములగు
శరీరములు పాత్రలు
శేష విశేషములు తమతమములు
వశములు వంశములు అవశ్యములు
అందిచును జయాపజయములు
ఆత్మ గుణావేశితమై బుద్ధి యగును
బుద్ధిని గుంజును ప్రాకృతిక భూతములు
బృహదాత్మ ప్రకృతి గహ్వరము
అది కృష్ణపక్షము చీకటికటువై
తీపై మోహ కామ జిహ్వాగ్రరుచులౌను
తను తప్తముగాక తనువున మనుటె
ఆత్మకు నిజ విజయము అదియె
భవమె భారతమనెడి బృహదాత్మ
అందందు వసించినసించెడితృణజాలములు
ఆనందక్షణికములెన్నొ కలసి ఆయువు
క్షణక్షణ ఉద్బుధములు
జరాజన్మలై ద్యోతకములగు
ఆత్మకు అక్షౌహిణీ సైన్యములవి
తిత్తిన నిలచి పుట్టిచచ్చి సేవించు
ఆత్మకు ఔపాసనోధారకములు
జయమను యానమున పరిత్యాగములౌ

No comments:

Post a Comment