Monday, February 18, 2019


చేతనాత్మ తనువు నిండారె
రెండు కన్నుల నిండి కోలువాయె
ఎరుకరాని పరమాత్మ యెదురునిల్చె
ఎటు తిరిగినయటు కల యందు
మెలకువనందు వేలుపు కొలువె
నీల లఘువుగ నద్దిన మేఘ మాల
చాలచక్కగ మేని సొబగయ్యె
పాలసంద్రము నాదు లేతమనముగాదె
వేలకోటుల మనములమనము
మునివ్రేళుల మురళి పునికి
ముని నారదుల భక్తిసూత్రిత
సూన ప్రసూన గాన ప్రహేలిక
క్షరాక్షర నిక్షీప్త తప్త తృప్తకాంచనము
శ్రీమత్తిరువాయిమొళి ప్రాభవము


No comments:

Post a Comment