జగమున జనన ప్రజనములు బహుళములు
దివాకర దిగంతర వ్యాపనమే యిజ్జగతి
గతి స్థితమౌ స్థితిగతమౌ కలన సంకలన పతి
పతిత పావనుడె నిజము నీడ ధూమ ధీమహి
మహిత మహతి జవము జీవము సత్యము
తెలిసి తెలియని తొల్లిటి వెలుగు వేల్పుల వేలుపు
నలుపుకడుపున నీడ చీకటి చిక్కటి కనులు
ధవళరేకల వెలుగు కొలను జీవ తంపరలతామర
రవి బింబ విస్ఫులిత కోటికోటుల ఆత్మ రూపకములు
అల్పములధికములు స్ధిరములు తిర్యగ్జడములు
తొలుత ఆత్మ తెలివిడియె వేదాంత లక్ష్యము
మృతికా స్మృతికి మృత్తిక ఘటితఘట జన్మ
శరీరి అశరీర ఆకృతిన మృత్య శోధన నెంచె
చచ్చినపిమ్మటజవజీవములకై గైరికాదిగ నెంచె
మిక్కిలిధాతువుల! అరయగ చిక్కడె విధాత
యాగముల భోగముల త్యాగముల చిక్కడె
భుక్త శేషము శేష జీననము నసించెడివె
త్వరితముగ నెరిగినది జాతస్యమరణంధృవమ్
దివాకర దిగంతర వ్యాపనమే యిజ్జగతి
గతి స్థితమౌ స్థితిగతమౌ కలన సంకలన పతి
పతిత పావనుడె నిజము నీడ ధూమ ధీమహి
మహిత మహతి జవము జీవము సత్యము
తెలిసి తెలియని తొల్లిటి వెలుగు వేల్పుల వేలుపు
నలుపుకడుపున నీడ చీకటి చిక్కటి కనులు
ధవళరేకల వెలుగు కొలను జీవ తంపరలతామర
రవి బింబ విస్ఫులిత కోటికోటుల ఆత్మ రూపకములు
అల్పములధికములు స్ధిరములు తిర్యగ్జడములు
తొలుత ఆత్మ తెలివిడియె వేదాంత లక్ష్యము
మృతికా స్మృతికి మృత్తిక ఘటితఘట జన్మ
శరీరి అశరీర ఆకృతిన మృత్య శోధన నెంచె
చచ్చినపిమ్మటజవజీవములకై గైరికాదిగ నెంచె
మిక్కిలిధాతువుల! అరయగ చిక్కడె విధాత
యాగముల భోగముల త్యాగముల చిక్కడె
భుక్త శేషము శేష జీననము నసించెడివె
త్వరితముగ నెరిగినది జాతస్యమరణంధృవమ్
No comments:
Post a Comment