మంచంమీద పడుకున్నాను. మగత నిద్ర అనుకుంటా, కాని తెలివీ స్పృహా బరువయ్యే ఊపిరి లో కొట్టుమిట్టాడుతున్నాయి.
నేను నాన్నగారి గా మారిపోతున్నాను
. ఏదీ ఆచెయ్యి, వెధవది అందదే. సరే నాకుడిచెయ్యి తల క్రింద పెట్టుకున్నది, నెమ్మదిగా తీసి ఎడమ చెయ్యి పట్టుకుంటా. అన్ది చావదే, అమ్మయ్య అందింది . చూపుడు వేలు నోట్లోకి పెట్టుకున్నా. కొరికే గోరు రుచే.అదిగో వాడొస్తున్నాడు. అడగాలి.ఏమడగాలి?
[29/05, 9:41 pm] satyalakshmistp: తిరువురెల్లిపోదాము. నన్నుతిరువూరు బస్సు ఎక్కించు. తిరువూర్లోనేగా నున్నది? మళ్ళీ తిరువూరు వెళ్ళడమేమిటి! తిరువూరు బస్సెక్కడమేమిటి.
నోట్లో వెలికితీసి చూసుకున్నా, నాచెయ్యి మాములుగానే ఉంది. అంటే నేను నాన్నగారు కాదు, బాబుని అన్న మాట. ఇది కలా, కలవరింత పట్టపగలు. నిన్న లక్ష్మీ "శ్రీ మన్నారాయణ దగ్గరకెళ్లాలి " అని మధ్యానం నిద్రలో స్పష్టంగా కలవరించింది. శ్రీమన్నారాయణ చచ్చిపోయాడు గదా అని
తన ని కుదుపుకుదిపి అడిగితే. " ఆ శ్రీమన్నారాయణ కాదని ఆన్నది
satyanarayanacharyulumaringant i
No comments:
Post a Comment