Friday, July 10, 2026

 04/07, 10:11 am] satyalakshmistp: అది తిరుసెంగళం తాతగారి ఇల్లు. ఆయన తిరునామాలతో వెలిగిపోతూ నాన్నగారిని నన్ను చాలా ఆప్యాయంగ రిసీవ్ చేసుకున్నారు. వారి ఇల్లు G. T రోడ్డుకి భోగిలింగేశ్వర ఆయుర్వేద నిలయం రోడ్డుకి మధ్య విస్తరించి ఉంటుంది. మంగ అత్త గారి ఇంటి ప్రతి పడమటి వైపు గోడ అవతల భోగిలింగేశ్వర ఆయుర్వేద నిలయం వారిది. మేము మగత గారి ఇంటికి వెళ్ళాము. నన్ను నా టోపిని చూసి మంగత్త సంతానం అమ్మలు వదిన సంతానం  చాలా ఆట పట్టించారు. నన్ను పాట పాద మన్నారు. నేను బోలెడు పాటలు పాడాను.అప్పుడు కూడా నవ్వారు.అప్పుడు నాకు సిగ్గనిపించి తల దించుకున్నాను. మంగత్త  గారు పిల్లలని  కసిరి నన్ను ఒళ్ళో కూచోబెట్టుకు టోపీ తీసి ' ఎంత అందంగా ఉందో వీడి జుట్టు తలకట్టు ఎంత బాగుందో  అని తలకి కొంచెము నూనె పట్టించి దువ్వారు. ఈలోగా రాఘవుడు మామయ్య గారు వచ్చి నాపేరు తెలుసుకుని సత్యం అని పిలిచారు. వదినెలు చిన్న వాళ్ళు అప్పుడు నన్ను సత్యం బావ అని గౌరవించారు. మంగత్త గారి సంతానంలో ఒకాయన అప్పుడే వరండా లోకొచ్చాడు. నన్ను, ఆటపట్టిస్తున్న అందరిని గమనిస్తున్నాడు.ఆయనకి ఒక కాలు లేదు . చంకలో కర్రలున్నాయి. జుట్టు పొడుగ్గా పాలచగాభుజాలకింది జారిఉంది. పొడుగు గడ్డం గుండెల్దాకావుంది. చూడబోతే చందమామలో మునీశ్వరుడి బొమ్మలావున్నాడు. ఆయన ఎవ్వరినీ పట్టించుకోవడంలేదు.

ఆయన అందరినీ నిశ్శబ్దంగా కూచోబెట్టాడుఅందరిచేతా పాటలు పద్యాలు పాడించాడు.ఒకరినొకరు వేళాకోళం చేసుకోకూడదని హితవు చెప్పాడు. ఆయన నన్ను సత్యం అని సంబోధించి తను రామభద్రుడు బావని అని చెప్పాడు. మేము మరునాడు ఉదయమే విజయనగరం బయలెళ్లిపోయాము
[04/07, 10:44 am] satyalakshmistp: కోరుకొండ చేరుకున్నాము. స్కూల్ దివ్య భవనంలా ఉంది. పెద్ద కాంప్లెక్. గుర్రాల శాల ప్లే గ్రౌండ్ డైనింగ్ హాల్ స్కూల్ ప్రేయర్ ప్లేస్ తరగతులు అద్భుతం గా అనిపించాయి. అవి చూడడంలో నన్ను నేను మర్చిపోయాను. గంట మోగింది. టైమ్ అయ్యిందట. నాన్నగారు చెయ్యిపట్టుకు పెద్ద హాల్ లోకి తీసుకెళ్లారు. చాలామంది నా కన్నా చిన్న వయసు వాళ్ళు ఉన్నారు. నాకుఎక్కలు బాగా వచ్చు కానీ బుర్ర తక్కువ. ప్రశ్న పత్రంలో నీ జవాబులు రాయాలి అంటే లెక్క క్రిందనే చెయ్యాలి అది బాగా అర్ధం అయ్యింది. 30 లెక్కలు. అన్నీచేసాను. ఇంకోపేపర్ కూడా ఇచ్చారు యాడ్3నుండి నాకర్ధం కాలేదు మైక్ లో ఏదో చెప్పాడు కానీ నాకు విని పించలేదో నేను లెక్కలు చేసి దిక్కులు చూస్తున్నాను. అప్పుడు ఒక కామెడం వచ్చి ఓ బాబు,
'లెక్కల ఆన్సర్లు  ఈ చెక్కర్ బాక్స్ పేపర్ లో వెయ్యాలి" ఆన్7 చెప్పింది. అప్పుడు ఇంకా 5 నిమిషాలు వుండిందేమో ఒక నిమిషమయ్యింతర్వాత మైక్  మొయ్యోమని మోగింది. యూ గాట్ ఓన్లీ 3 మినిట్స్ అని అరచింది. నేను కంగారుపడిపోయాను. తలెత్తి దించేసరికి ఆన్సర్ లు గాడి తప్పియొక లెక్కకు గడిలేదు. 
ఫలితం నేను పరీక్ష తప్పను. పోస్ట్ కార్ట్ బ్రాహ్మణ పోస్ట్మాస్టరు యిచ్చి నువ్వు పరీక్ష తప్పవు అని చెప్పాడు. ఇది నేను తప్పిన మొదటి కాస్ట్లీపరీక్ష. తిరిగొచెప్పుడు నాన్నగారు అక్కడ ఒక వాడినే టీచర్ గా పని చేస్తూ దట ఆవిడపేరు పిల్లమ్మ. నాన్న గారి నాలుగో అక్క కూతురు. ఆవిడ ద
శలవుమీద హైదరాబాద్ వెళ్ళినట్టు తెలిసింది. కోరుకొండ నుండి విజయనగరం  యూ
ఏడెనిమిది కిలోమీటర్లు వుంటుందేమో నడిచేశాము. రైలెక్కి తుని వచ్చేశాము. మరునాడు నాన్నగారికి స్కూల్ వున్నదిగదా అందుకు.

No comments:

Post a Comment