Sunday, February 23, 2025

 ----జంధ్యాలకి ముందరే మొదలయ్యింది

తెంచుకోవడము నకనకలాడేఆకలికి
కలికాలమేకానీ యమనియమాలకళ్ళు
కాలంచేసి మూసుకున్నాయనే అనిపిస్తోంది
కడుపునిండిన చలమే రాశాడు
బహుశహ:సాహిత్యపుమరమరాలు
తాపీగా నమిలివుంటాడు
వుద్దేశ్యము వేరైన తేడాలు
లోపలీ వెలుపలీ దృశ్యాలే
ఈ దేహంతో శోహంకాకుండా
ఎమేమోఅనాదిగాచేస్తూనేవున్నాము
పేరుకి బ్రాహ్మణుడూ,సూద్రుడూ
కర్మా కామం కాలం సమానమే
తినేతిండీ,పిసికేమట్టీ పిడికెడుపొట్టా
చావూ,పుటకా తీరొకటే
అవునూ ఈజాతిలోనే నలుగురూ
కలసి ఒక్కరే ననిమెదిలే వూహ
సంకుల సమరంలో వికృతమైపోయింది
సాయిబులొచ్చి చేసేకృత్యాలుచూసి
తొలిమెట్టవతలే అరే వీళ్ళూ
మనుషులేకానీ ఫకీర్లనీ
వుంపుడుగానో తెంపుడుగానో
భలే బాగని చావుని
చావగొట్టే తాపీవాళ్ళయ్యరు
పంచేద్రియాల అగచాట్లలో
ప్రధమద్వారమే సమాధని
కబళానికి పనికిరానివాటికి
సమాధానము జనానా పనికొచ్చేది
హలాల్ అయితేనేమీ మారినగతిలో
మనుగడ చెరకు తీపేగా
ముత్తైదువలూ సాహెబాలూ
పరివర్తనపర్వంలో సాలభంజికలు
అవతారం ప్రాణంకన్నా చిన్నదే
జీవితంలో లాశ్యము దాశ్యముకాదు
అవశ్యమూ అనుభవీక్యము
మారిన తెగ మరో బలమైన పగ
పొగచూరిన దేవళాల్లో రక్త
కుంభాభిషేకాలు ఘజనీ
తర్జనికి అపభ్రుదాయహా:
పునరప భ్రుదాయహా: ఓ
హిందూ,భరత రతీ పుత్రుడా
అనులోమమప్పుడే ఆరంభమైనకధ,
రాగములో అనురాగానికి
సాయిబూ,నులకమంచమూ
పేద్ధ అడ్డంకావని కోమలిచెప్పలా!!
అధర్వణము మాని వైదీకం వదలి
జధ్యం వీపు గోక్కోవడానికైనప్పుడు
తప్పదుగా తప్పులు ఒప్పులవడమూ
నెలతలు కలతలేమీకావని పురపు
దారివదలి కాపురము చెయ్యడమూ!!
అడ్డమైన వాటిని వదలి వడిగా
నీళ్ళ మనసు జారేదేగదూ!
సందేహమెందుకు, సంస్కారము
నీభాష్యము మీదే నిలబడుతుంది!
పేధ్ధ తపస్సులూ,యోగమూ అక్కర్లా
ఎల్లాగా చచ్చేవాళ్ళమేగా భూమ్మీద
ఆ సుఖమేదోపడేడుద్దామనే భమలూ
బతికుంటే బలుసాకు తీపనుకేబ్రాహ్మలూ
తప్పు మీదేమీ కాదు మనుగడదే
మన మహీపాల దివాకరాదిత్యులదే
Like
Comment
Send

No comments:

Post a Comment