Saturday, August 29, 2015

రిక్తహస్తాలతో దిగంతాలని కొలవాలనుకున్నా
తీతువు కూతతో వులిక్కిపడింది నా అహం  
బ్రహ్మాన్ని మిధ్యగాఎంచి పొంచివున్న చీకట్లోనే
జగాన్ని గజాలలో కొలుస్తా,కానీ ఆకాశము క్షతగాత్రము
నక్షత్ర చిదాచిద్కిరణాలు నా చూపుని చిదిమేస్తున్నాయి
కాస్సేపు కళ్ళుమూసుకు చూస్తా,సద్యోమార్గము గోచరించచ్చు
 బయలుదేరినచోటికే చెరుతున్నా గమనము భ్రమణమైనది
కళ్ళుతెరుద్దామనుకున్నా,చీకటివెలుగులడ్డవుతున్నాయి
సత్యమో అసత్యమో మృత్యుగహ్వరపు అంచులు తగిలాయి
విహ్వలమైనది,వైతరిణి కాబోలు,దాటలేనే,
మతి గతిలోకిరావాలని కళవళ పడిపోతోంది
ఏ దేవతలూ,అడ్డురారే,మిధ్యామూర్తులేనా
నేతలచిన దేముళ్ళు పలికితే బాగుండును
అదిగో అజాగళము దర్శనమిస్తోంది,
దాని క్షీరాన్ని గ్రోలితే జ్ఞానోదయమౌతుంది
కధ తెల్లారడానికీ,ప్రాణము చల్లారడానికీ
పనికొచే పడవ అదిగో షోణ నదిలో వుంది
ఈస్తంభాన్నిక వదిలి ఆపడవెక్కుతా.

 

No comments:

Post a Comment