నా నాలిక చీలికలో అహం
--నామ్రోలన నీవని యతికి ప్రతిగా
ప్రతి లిప్తా మాటకి మాటగా--
నేపాడే పాటకి పోటుగా
దేముదంటే దయ్యమని --
మంచంటే చెడుగు అనీ పది గొంతులతో
గొడుగు విప్పి చీకటి పరుస్తోంది -
తనేమో చీకట్లో నిద్దరోతుంది --
వెలుగవ్వదు గుడ్డి వెలుగులో
నేనీ మ్రోలన నిలుచుంటే
నాకన్నా తెగ బారెడు నీడై --
తెగ నవ్వుతుంది మనసు
విశద పరుద్దామనుకొంటే --
కొక్కిరిశ్తుంది నే సిగ్గుగా
గుడ్డకప్పుకుంటే--సిగ్గులేకుండా
గంతులేస్తుంది నే దండంపెడితే
తను తడిమి చూస్తుంది తప్పంటే
తప్పకుండా--తప్పే చూస్తుంది
నే తప్పు చేస్తుంటే --చెప్పకుండా
ఊరుకుంటుంది ,నే కర్ణుడిని కాను
అసలే చెవిటిని--అయినా చెవిలో
ముల్లవుతుంది వద్దంటే సోది --
విననంటే సూది నువ్వసలు పసువ్వేనని --
ముక్కునేలకి రాస్తుంది అయినా
వెలుగే నేనని తను చీకతని
నా అహం అహరహం చాటుకునే
నేను నిజంగానే విక్రుతినేమో
చీలికలో దాగున్న తనే--నన్ను
తట్టి లేపే నేజమేమో భగవాన్మమ్మల్ని
కలిపెయ్యి--కలత లేకుండా కల్లో కూడా
నిన్నే (దేముదవో మరేమోవో)--నేనూ తనూ
వెతికేందుకు నే పసువైనా తను శిసువైనా--
యుగళ గీతంలా భువన త్రయంలో--
తుంబుర నారదులౌతాము!!
No comments:
Post a Comment