Friday, May 22, 2020

వలయమేకానీ తిరుగుతూనేవుంటుంది
తూలిపడిముందుకూ త్రుళ్ళిపడి వెనక్కూ
నడకో పరుగో స్థబ్దమై నిలవరించబడో
తిరుగుతోనేవుంటుంది,,మెరసిన నిన్నటి
కురులు వేకువపొద్దుకలలో నెరపులయ్యాయి.
మళ్ళీరాత్రి చిన్న తనంచిందుల బృందగానం
పరువంప్రకృతి గమనం ప్రకృతే.నిశ్శబ్దం కాదేమో!
నిరంతర చలనంలో కాలప్రవాహి అలలపై
ముందుకూ వెనక్కీ సాగుతూ ఆగిపోయే
సంగతుల చిత్తడిపాట అందమే, వివిధమే!
ప్రతిబతుకూ పూలదండలో దాగినదారమే!
పుటుక్కున తెగే దారంముక్కలెంత
వైవిధ్యములో అంత సారూపకములు.
 నిడివి తప్పి కాలంచేసే సువాసనలే!
తవ్వి తరాలు వెతుక్కునే మనిషి
నీడ చూసి పొడుగనుకుంటాడు,
కీర్తికోసంగతజలసేతుబంధనమా!
అవును., ఉనికి  అవ్యయ మవ్వాలంటే
వలయాన్నిఛేదించాలంటే
వ్యోమకూపంలో ధూమకేతువు' నే'
నవ్వాలని సకలేంద్రియ యింధనాలూ
నల్లేరుపైబండినడక చేసి సాగుతాడు.
కాని కాని అలెగ్జాండరూ అశోకుడూ
ఘజనీ పుటుక్కున దారంతెగి
కాలంఅంచులో కాలంచేశారు.
కాటుకచీకటి నిజంచెప్పేది
ఘూతక జనం కనగలిగేదా,
పాతక క్రియా చేతననాపేదా!
అన్ను వలయ బంధిత జీవాలే!
ఆలోచించి అనాలోచితనాలేమో!
చిన్నవికొన్ని దీర్ఘాలు మరికొన్ని!
తెలిసి తెలిసీ తెల్లార్చె చావుకి
ఖనన దహన హనన మరణాంతర
క్రియాబేధాలూ మృదంగ తురంగ
షడంగ అభంగ అభ్యంతర విన్యాసాలూ
ఏడ్పులూ నవ్వులూ మొత్తుకోళ్ళూ
మర్యాదమర్యాదలూ సర్వ సమానాలు!!
కాలానికి టోపీలేదు, నామాలూలేవు
పృఛ్ఛకుడి ప్రశ్న అవధాని జవాబూర్
రెండూ పిచ్చివే అవనిక యెత్తేసరికి


1 comment:

  1. పూర్ణ చంద్ర బింబ - రాగ మాలికా - తాళం రూపకమ్

    పూర్ణ చంద్రికా రాగం
    పూర్ణ చంద్ర బింబ విజయ వదనే కమలాంబికే
    పాహి మాం వరదే గురు గుహ జనని శ్రీ

    నారాయణీ రాగం
    పుణ్య జన పూజితే నారాయణీ జగదంబికే

    సరస్వతీ మనోహరి రాగం
    పూర్ణ ఫల ప్రద చరణే సరస్వతీ మనోహరే

    శుద్ధ వసంత రాగం
    పుష్పిత శుద్ధ వసంతే పుండరీక సదృశ కరే

    కేదార రాగం
    కేదారేశ సహాయే గురు గుహ వేదిత హృదయే

    బిలహరి రాగం
    భండ ప్రాణ బిల హరి భక్త జనానంద-కరి

    హంస ధ్వని రాగం
    అహర్నిశం ప్రకాశమాన హంస ధ్వని విరాజితే

    నాగ ధ్వని రాగం
    అపర్ణే కుండలిని నాగ ధ్వని సహితే
    ధ్వని సహితే సహితే హితే తే

    పూర్ణ చంద్రికా రాగం
    పూర్ణ చంద్ర బింబ విజయ వదనే కమలాంబికే
    పాహి మాం వరదే గురు గుహ జనని శ్రీ

    నారాయణీ రాగం
    పుణ్య జన పూజితే నారాయణీ జగత్-అంబికే

    సరస్వతీ మనోహరి రాగం
    పూర్ణ ఫల ప్రద చరణే సరస్వతీ మనోహరే

    శుద్ధ వసంత రాగం
    పుష్పిత శుద్ధ వసంతే పుండరీక సదృశ కరే

    కేదార రాగం
    కేదార-ఈశ సహాయే గురు గుహ వేదిత హృదయే

    బిలహరి రాగం
    భండ ప్రాణ బిల హరి భక్త జన-ఆనంద-కరి

    హంస ధ్వని రాగం
    అహర్-నిశం ప్రకాశమాన హంస ధ్వని విరాజితే

    నాగ ధ్వని రాగం
    అపర్ణే కుండలిని నాగ ధ్వని సహితే
    ధ్వని సహితే సహితే హితే త

    .....,,,,..........,.....,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,!!!!!!!!,

    పూర్ణ చంద్ర బింబ విజయ వదనే కమలాంబికే
    పాహి మాం వరదే గురు గుహ జనని శ్రీ
    పుణ్య జన పూజితే నారాయణీ జగత్-అంబికే
    పూర్ణ ఫల ప్రద చరణే సరస్వతీ మనోహరే
    పుష్పిత శుద్ధ వసంతే పుండరీక సదృశ కరే
    కేదార-ఈశ సహాయే గురు గుహ వేదిత హృదయే
    భండ ప్రాణ బిల హరి భక్త జన-ఆనంద-కరి
    అహర్-నిశం ప్రకాశమాన హంస ధ్వని విరాజితే
    అపర్ణే కుండలిని నాగ ధ్వని సహితే
    ధ్వని సహితే సహితే హితే త

    @..................,,,,,,,,,.............,,.,,,,,,,,,............,,,,,;;;;;;,,,,,,,

    ప్రఙ్ఞ పాడిన పూర్ణ చంద్రబింబవదనే కమలాంబికే
    ........ముత్తుస్వామి దీక్షితార్ కృతి విన్నఙ్ఞాన
    ప్రసాదము....

    ప్రఙ్ఞాన పరమేష్ఠీప్రమదామనోఙ్ఞవసనే
    పూర్ణచంద్రవదనే గమనిగమపదలయవిలసితేసలలితాసుమశోభితసంగీతగీర్వాణీ పూర్ణచంద్రబింబవదనే దమశమదృమపరిపూరకే పూర్ణచంద్రబింబవదనే
    జితే విరాజితే సకలశాస్త్రశుభవాసితే
    సురార్చితే విమలయశస్కరభాసరె
    భావరాగప్రాణధారకే కేయూరకంకణ కరభూషితే భాస్కరార్చిత వేదమాతృకె
    పూర్ణచంద్రబింబవదనే
    ఙ్ఞానశిఖరే హుతప్రక్షాళిత యఙ్ఙాగ్నిమగ్న మంత్రాత్మకే ప్రియంవదే శ్రియం వరదే పూర్ణచంద్రబింబవదనే.......
    ,,

    ReplyDelete