అను క్షణికమే
యుగ సంధ్యలకావలనా మృగ తృష్ణల కావలనా
తెగ తెంపులు లేని కాల కల్పనల సత్యస్పందన
సగ జీవితం నిదురలో విగతమయి మిగులు
పగ లో తెగ వెంపర్లాడే నిజ నైజపు తెగులో
యుగాలుగా వెదజల్లబడిన ముళ్ళపొదల్లో
కీటకంగానో ఖగనగమృగంగానో పుట్టి
భ్రమలో భ్రమరాన్నై మనసును పెంచుకు
మనిషిగా పుట్టాను కానీ పూర్వ సువాసనలు
మస్తిష్కాన్ని పట్టి పల్లార్చుతూనే వున్నాయి
నాలోంచి తొంగి చూసే పశువు కసవు మేస్తూనేవుంది
క్రిమికీటకాంశలు జాగృదమౌ తోనేవున్నాయి
వెనక్కి పరిగెట్టి మది మొదలెక్కడో పట్టుకుందామంటే
నిద్రలోనూ స్పృహా విహ్వలతే, ఏ గర్భంలో
విత్తు మొలకెత్తిందో ఏ మర్మంలో బుధ్ధి వికసించిందో
యీ జన్మలో విపుల మయ్యింది కాని
వివరము మరుస్తూనే వుంది ఏమరచి
సత్యస్పృహలో విహరించినా అది అను క్షణికమే
సగ జీవితం నిదురలో విగతమయి మిగులు
పగ లో తెగ వెంపర్లాడే నిజ నైజపు తెగులో
యుగాలుగా వెదజల్లబడిన ముళ్ళపొదల్లో
కీటకంగానో ఖగనగమృగంగానో పుట్టి
భ్రమలో భ్రమరాన్నై మనసును పెంచుకు
మనిషిగా పుట్టాను కానీ పూర్వ సువాసనలు
మస్తిష్కాన్ని పట్టి పల్లార్చుతూనే వున్నాయి
నాలోంచి తొంగి చూసే పశువు కసవు మేస్తూనేవుంది
క్రిమికీటకాంశలు జాగృదమౌ తోనేవున్నాయి
వెనక్కి పరిగెట్టి మది మొదలెక్కడో పట్టుకుందామంటే
నిద్రలోనూ స్పృహా విహ్వలతే, ఏ గర్భంలో
విత్తు మొలకెత్తిందో ఏ మర్మంలో బుధ్ధి వికసించిందో
యీ జన్మలో విపుల మయ్యింది కాని
వివరము మరుస్తూనే వుంది ఏమరచి
సత్యస్పృహలో విహరించినా అది అను క్షణికమే
no comments
no plus ones
one share
No comments:
Post a Comment